
ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్ యాక్షన్ సినిమా వచ్చే నెల 1న విడుదల కానుంది. రెట్రో మూవీతో హీరోయిన్ హీరోయిన్ పూజా హెగ్డే, సూర్య మంచి హిట్ అందుకుంటారని టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ తో దూసుకెళ్తూ.. మరింత అంచనాలు పెంచుతుంది. ఇక సూర్య మళ్లీ లవ్ స్టోరీతో రావడంతో అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. రెట్రో సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ఈ సినిమాలో హీరో సూర్య, హీరోయిన్ పూజా హెగ్డే పాత్రలు చాలా కొత్తగా ఉంటాయని మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా మంచి రికార్డ్ కొడుతుందని టాక్ కూడా వినిపిస్తుంది.
అయితే ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాలో సూర్య తొలి హీరో కాదనే వార్త ఒకటి తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా దర్శకుడు కార్తీక్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఈ సినిమా కథని నేను సూపర్ స్టార్ రజినికాంత్ కోసం రాసుకున్నాడు. ఈ సినిమా పూర్తి యాక్షన్ జోన్ కథ. కానీ సూర్యని హీరోగా అనుకున్న తర్వాత.. ఆయనకి కథని చెప్పే అప్పుడు సినిమాని లవ్ స్టోరీగా మార్చాను' అని కార్తీక్ చెప్పుకొచ్చారు. సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.