
సాయిపల్లవి నటిస్తే ఆ సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రామాయణంలో సీత పాత్రలో సాయిపల్లవి నటిస్తుండగా ఈ ఏడాదే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ విడుదల కానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమా గురించి సాయిపల్లవి మాట్లాడుతూ థియేటర్లలో ప్రేక్షకులు తన కథా పాత్రలను చూసి అందులోని ఎమోషన్స్ తో లీనమైతే చాలని సాయిపల్లవి అన్నారు.
పాత్రల ద్వారా యదార్థతను చెప్పే తరహా పాత్రలను తాను ఎప్పుడూ కోరుకుంటానని ఆమె పేర్కొన్నారు. తాను భావించిన విధంగా ఆ కథా పాత్రల్లోని ఎమోషన్స్ ను ప్రేక్షకులు కనెక్ట్ అయితే పెద్ద విజయంగా భావిస్తానని సాయిపల్లవి కామెంట్లు చేశారు. అవార్డ్స్ కంటే అభిమానుల ప్రేమభిమానాలే ముఖ్యం అని సాయిపల్లవి వెల్లడించారు. సాయిపల్లవి సోషల్ మీడియాలో సైతం క్రేజ్ పెంచుకుంటున్నారు.
సాయిపల్లవి తనకు అవార్డులతో పోలిస్తే అభిమానుల ప్రేమాభిమానాలే ముఖ్యమని సాయిపల్లవి అన్నారు. సాయిపల్లవి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. సాయిపల్లవి లుక్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు. సాయిపల్లవి ఇతర భాషల్లో సైతం రికార్డులు క్రియేట్ చేస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. సాయిపల్లవి ఇతర హీరోయిన్లకు భిన్నంగా అడుగులు వేస్తున్నారు. సాయిపల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీలో టైర్1 హీరోలకు జోడీగా నటిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. స్టార్ హీరోయిన్ సాయిపల్లవికి ఈ ఏడాది తండేల్ సినిమాతో భారీ సక్సెస్ దక్కింది.