సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం అనేక మంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ అందులో అత్యంత తక్కువ మందికి మాత్రమే నటించిన మొదటి సినిమాతో అదిరిపోయే రేంజ్ విజయం ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వస్తూ ఉంటుంది. అలా నటించిన మొదటి సినిమాతోనే అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్న అతి కొద్ది మంది నటీమణులలో శ్రీ నిధి శెట్టి ఒకరు. ఈమె యాష్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జీ ఎఫ్ చాప్టర్ 1 మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యింది.

మూవీ తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో ఈమెకు మంచి విజయం దక్కింది. ఆ తర్వాత ఈమె నటించిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో ఈమె క్రేజ్ ఇండియా వ్యాప్తంగా మరింతగా పెరిగింది. ఇలా కెరియర్ ప్రారంభంలోనే రెండు భారీ విజయాలను అందుకున్న ఈమె ఆ తర్వాత తమిళ నటుడు విక్రమ్ హీరోగా రూపొందిన కోబ్రా అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మాత్రం బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత ఈమెకు పెద్ద స్థాయిలో అవకాశాలు కూడా రాలేదు. ఇకపోతే ప్రస్తుతం ఈమె తెలుగు సినిమాల్లో నటిస్తూ వస్తుంది.

ఈమె తాజాగా నాని హీరోగా రూపొందిన హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మే 1 వ తేదీన విడుదల కానుంది. అలాగే ఈమె సిద్దు జొన్నలగడ్డ హీరో గా రూపొందుతున్న తెలుసు కదా అనే సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తుంది. ఈ రెండు మూవీలు కనుక మంచి విజయాలు సాధిస్తే ఈ నటికి తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు లభించే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: