- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

మాట‌ల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ అంటే గొప్ప దర్శకుడు .. మంచి మాట‌ల ర‌చ‌యిత అన్న టాక్ టాలీవుడ్ లో ఎప్ప‌టి నుంచో ఉంది. ఎప్పుడో రెండున్న‌ర ద‌శాబ్దాల క్రింద‌ట త‌రుణ్ - శ్రీయ జంట‌గా తెర‌కెక్కిన నువ్వే నువ్వే సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన త్రివిక్ర‌మ్ త‌న రెండో సినిమా తోనే ఏకంగా మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన అత‌డు సినిమాను డైరెక్ట్ చేశాడు. అత‌డు సినిమా తో ఒక్క‌సారిగా త్రివిక్రం టాలీవుడ్ లో టాప్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో జ‌ల్సా సినిమా తీసి సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్ట‌డంతో త్రివిక్ర‌మ్ కు తిరుగు లేకుండా పోయింది. ఇక త్రివిక్ర‌మ్ సినిమా ల‌లో ప‌దే ప‌దే హీరోయిన్లు రిపీట్ అవుతూ ఉంటారు .. మ‌నోడికి న‌చ్చితే క‌నుక‌గా వారినే రిపీట్ చేసుకుంటూ వ‌స్తుంటాడు.


ఒక్క సారి త్రివిక్రం సినిమా ల‌లో చేసిన హీరోయిన్ల లిస్ట్ చూస్తే పార్వతీ మెల్టన్ , ఇలియానా , సమంత , నిత్యా మీనన్ , పూజా హెగ్డే , సంయుక్త మీనన్ .. వీళ్ళందరినీ గురూజీ ఎంత బాగా చూసుకున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మిగిలిన వాళ్ల విష‌యం లో ఏమోగాని త్రివిక్రం సంయుక్త మీన‌న్ విష‌యంలో మాత్రం అడ్డంగా దొరికిపోయాడు. ఓ సినిమా ఆడియో ఫంక్షన్ లో కాల్ చేయమని సంయుక్త మీనన్ కి సైగ చేయగా .. దానికి ఆమె కూడా చిలకలా నవ్వుతూ చేయితో సైగ చేస్తూ ఒకే అన్న‌ట్టుగా చెపుతుంది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగి ఉంటుందో ఊహించుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదు.


ఇక త్రివిక్రం బుట్ట‌లో ప‌డితే ఏ హీరోయిన్ అయినా ఆయ‌న‌తో రెండు మూడు సినిమాలు వ‌రుస‌గా చేయాల్సిందే. అయితే ప్రణీత..మేఘ ఆకాష్, ఈషా రెబ్బ లాంటి వారు మాత్రం బాగానే తప్పించుకున్నార‌ని అంటారు. అయితే వీరు స్టార్ హీరోయిన్స్ కాదు కానీ లాభం ఉండదని ఆయ‌న పక్కన పెట్టారేమో అన్న టాక్స్ కూడా న‌డిచాయి. మేఘ ఆకాష్ లై , ఛ‌ల్ మోహన రంగ సినిమాలలో నటించినా ఆ టైంలో త్రివిక్రం క‌న్ను ఆమె మీద ప‌డ‌లేదు. ఇలా కొంద‌రు హీరోయిన్ల క‌న్ను ప‌డ‌క‌పోవ‌డంతో వారు త‌ప్పించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: