- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

టాలీవుడ్ లో ఇప్పుడు ప‌లువురు యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల తో పాటు కొంద‌రు ప‌ర‌భాషా మ్యూజిక్ డైరెక్ట‌ర్ల హ‌వా కూడా ఎక్కువుగా న‌డుస్తోంది. ఇక ఇప్పుడు సీనియ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్లు గా ఉన్న మ‌ణిశ‌ర్మ తో పాటు కోటి లాంటి వాళ్లు ఇంకా కెరీర్ కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు. కీర‌వాణి కూడా ఈ లిస్టులో ఉంటారు. కుర్ర మ్యూజిక్ డైరెక్ట‌ర్ల నుంచి ఎంత పోటీ ఉన్నా కూడా వీరు త‌మ కెరీర్ లాక్కొస్తున్నారు. ఒక‌ప్పుడు అంటే సుమారు 25ఏళ్ల క్రితం టాలీవుడ్ లో సంగీత దర్శక ద్వయం రాజ్-కోటి కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి పనిచేశారు. వీరిద్ద‌రు విడిపోక ముందు ఓ సినిమా చేశారు అంటే ఆ ఆల్బ‌మ్ పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యేది. వీరు అప్ప‌ట్లో ట్యూన్స్ నుంచి మొద‌లు పెడితే  బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వరకూ కలిసే వర్క్ చేసేవారు. మ్యూజికల్ హిట్ గ్యారెంటీ అని దర్శక నిర్మాతలే కాదు, హీరోలు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉండేవారు. రాజ్ - కోటి అంటే చాలు ఆ పేరు పోస్ట‌ర్లో ఉంటేనే ఓ సంచ‌ల‌నం.


ఇక రాజ్ - కోటి కలిసి సంగీతం అందించిన మొదటి సినిమా ప్రళయ గర్జన. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల కు ప‌ని చేశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన యముడికి మొగుడు , లంకేశ్వరుడు , ముఠా మేస్త్రి అప్పట్లో మంచి మ్యూజికల్ హిట్లు గా నిలిచాయి. అలాగే బాలగోపాలుడు , బంగారు బుల్లోడు , హలో బ్రదర్ , అన్న - తమ్ముడు లాంటి సినిమాలకు ఈ జంట సంగీత ద‌ర్శ‌కుడు సంగీతాన్ని సమకూర్చారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య కొన్ని క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ వ‌చ్చాయి. దీంతో రాజ్-కోటి విడిపోవాల్సి వచ్చింది.  ఆ తర్వాత రాజ్ సంగీతం అందించిన సినిమాలు చాలా తక్కువ .. ఆయ‌న కెరీర్ అనుకున్న‌ట్టుగా సాగ‌లేదు. రాజ్ ఒక్కడే సంగీతం అందించిన సినిమా "సిసింద్రీ". మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశాలు తగ్గాక  కొన్ని టీవి షో లకు ఆయ‌న న్యాయ నిర్ణేత‌గా ఉన్నారు. ఇక కోటి మాత్రం ఇప్ప‌ట‌కీ సంగీత ద‌ర్శ‌కుడి గా త‌న ప్ర‌స్థానం కంటిన్యూ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: