- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

మెగాస్టార్ చిరంజీవి త‌న కెరీర్ లో ఎంద‌రికో ఆద‌ర్శం గా నిలిచారు. అలాగే చిరు సినిమా ల‌తో అవ‌కాశాలు పొందిన ఎంతో మంది కెరీర్ ప‌రంగా పైకి వ‌చ్చారు. ఈ లిస్ట్ చాలా పెద్ద‌దే ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి వల్ల రాఘవ లారెన్స్ సౌత్ లో పెద్ద కొరియోగ్రాఫర్ పాపులర్ అయ్యి .. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడు అవ‌తారం ఎత్తి ఎన్నో హిట్ సినిమాలు తీశారు. ఇక చిరు బాట‌లోనే సామాజిక సేవ‌లో కూడా గొప్ప గా రాణిస్తున్నారు. చిరంజీవి వల్ల ఒకరు పైకొస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి రాఘ‌వ లారెన్సే పెద్ద‌ ఉదాహరణ. అయితే, రచయితగా మంచి కెరీర్ తో దూసుకు పోవాల్సిన ప్రముఖ క‌మెడియ‌న్ ఎల్ బీ శ్రీరాం లాంటి వాళ్లు మాత్రం చిరు అవ‌కాశం ఇవ్వ‌డం వ‌ల్ల తమ కెరీర్ ప‌రంగా దెబ్బ తినాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇందుకు చిరు ఎలా కార‌ణం అయ్యాడు ? అని ఆశ్చ‌ర్య పోతున్నారా ? అస‌లు నిజం తెలు సు కోవాల్సిందే.


చిరంజీవికి వరుసగా ఫ్లాప్స్ వచ్చిన రోజులు తెలిసిందే. ముఠామేస్త్రి, అల్లుడా మజాకా, ముగ్గురు మొనగాళ్ళు, ఎస్పీ పరశురాం, లాంటి వరుస డిజాస్టర్స్ తర్వాత హిట్లర్ సినిమాతో చిరు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్టు కొట్టి కం బ్యాక్ అయ్యాడు. ముత్యాల సుబ్బ‌య్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా లో రంభ చిరుకు జంట‌గా న‌టించింది. ఈ సినిమా తోనే రాఘవ లారెన్స్ కొరియోగ్రాఫర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా వ‌ల్ల అంద‌రి కెరీర్ కు చాలా ప్ల‌స్ అయ్యింది. అయితే ఈ సినిమా కు మాట‌లు రాసిన న‌టుడు .. క‌మెడియ‌న్ ఎల్బీ శ్రీరామ్ కెరీర్ కు మాత్రం చాలా మైన‌స్ అయ్యింది. మెగాస్టార్ సినిమా కు డైలాగులు రాసే అవ‌కాశం రావ‌డం గొప్ప విష‌య‌మే .. అయితే అంత పెద్ద సినిమాకు అవ‌కాశం రావ‌డంతో ఆ త‌ర్వాత ఆయ‌న కు అవ‌కాశాలు ఇచ్చేందుకు చిన్న సినిమాల నిర్మాత‌లు .. ద‌ర్శ‌కులు వెన‌క‌డుగు వేశార‌ట‌. ఎక్కువ రెమ్యున‌రేష‌న్ అడుగు తారేమో అన్న డౌట్‌తో చిన్న సినిమాల వాళ్లు అవ‌కాశాలు ఇవ్వ‌లేదు. అలా అని పెద్ద సినిమాల‌కు ఆ త‌ర్వాత ఛాన్సులు రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: