జూనియర్ ఎన్టీఆర్ ..సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ బడా హీరో . సినిమాల కోసం ఏమైనా చేసే హీరోలు చాలా రేర్ గా ఉంటారు . అలాంటి హీరోలలో టాప్ పొజిషన్లో ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ . ఒక సినిమా కోసం ఎంత కష్టమైనా భరించే సత్తా ఉన్న హీరో ఒక సినిమా కోసం బరువు తగ్గమన్న తగ్గుతాడు పెరగమన్న పెరుగుతాడు.  సినిమా కోసం ఎంత రిస్కీ షాట్స్ అయినా చేస్తాడు.  అలాంటి హీరో జూనియర్ ఎన్టీఆర్ . కాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ దాదాపు 18 కేజీల బరువు తగ్గాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .


ఎన్టీఆర్ లుక్స్ కూడా పూర్తిగా మారిపోయాయి . చాలా చాలా స్లిమ్ గా స్టైలిష్ గా మారిపోయాడు . అయితే కేవలం ఐదు నెలల్లోనే  జూనియర్ ఎన్టీఆర్ 18 కేజీలు తగ్గాడు అన్న వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. కాగా ఎన్టీఆర్ డైట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . సాధారణంగా ఆయన తీసుకున్న డైటే జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్నారట.  కాకపోతే మూడే మూడు వస్తువులను దూరం పెట్టి ఏకంగా 18 కేజీల బరువు నెల రోజుల్లో తగ్గారట . ఉప్పు - నూనె - షుగర్ ఈ మూడిటిని అస్సలు టచ్ కూడా చేయలేదట తారక్.



ఆ కారణంగానే జూనియర్ ఎన్టీఆర్ లో ఇంత వేరియేషన్ కనిపిస్తుంది అంటున్నారు జనాలు . ఐదు నెలల్లో 18 కేజీల బరువు తగ్గడం అది కూడా హెల్తీగా తగ్గడం అనేది నిజంగా చాలా చాలా గ్రేట్ అంటున్నారు అభిమానులు.  సినిమాపై ఎంతో ఇష్టం ఉంటే తప్పిస్తే ఇలాంటి డెసిషన్ తీసుకోలేరు స్టార్ హీరోస్ అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తారక్ నటన వేరే లేవల్ లో ఉంటుంది అని చెప్పుకోవడంలో సందేహమే లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: