
కాగా ఈ సినిమాలో చిరంజీవి చాలా రీట్రో లుక్ లో కల్పించబోతున్నారట . చాలా స్టైలిష్ గా ఎంటర్టైనింగ్ ఈ మూవీ ఉండబోతుంది అంటూ తెలుస్తుంది . అయితే ఈ సినిమాలో ఓ పాటను రీమేక్ చేయాలి అంటూ డిసైడ్ అయ్యారట అనిల్ రావిపూడి . అనిల్ రావిపూడి తీసుకున్న డెసిషన్ ఏదైనా సరే సూపర్ సక్సెస్ అవుతుంది అన్న నమ్మకం జనాలల్లో వచ్చేసింది. "ఘరానా మొగుడు" సినిమాలోని "ఏందిబే ఎట్టాగా ఉంది ఒళ్ళు" అనే సాంగ్ ని ఈ సినిమాలో రీమేక్ చేయబోతున్నారట. సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ హల్చల్ చేస్తుంది.
ఘరానా మొగుడు సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ సినిమా గా నిలిచిపోయింది. ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో ఈ పాట ఎంత సూపర్ డూపర్ సెన్సేషనల్ హిట్ అయింది అనేది అందరికీ తెలిసిందే . ఇప్పుడు ఆ పాటని రిలీజ్ చేస్తే కచ్చితంగా జనాలు అంతకు ట్రిపుల్ స్థాయిలోనే ఆదరిస్తారు అన్న పాయింట్ ని క్యాచ్ చేసిన అనిల్ రావిపూడి ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఏ మాటకి ఆ మాటే ఈ పాట ఇప్పుడు మారిన మ్యూజిక్ తో వింటుంటే నరాళ్లు జివ్వుమనాల్సిందే..!