
ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా వచ్చే ఏడాది ఆగస్టు 14న రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా కూడా అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఇది టీవీ సీరియల్స్లలో వచ్చేటువంటి నాగిని సీరియల్ తరహాలో ఉండేలా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న ఈతరహాలో ఎన్నో కథలు కూడా ప్రేక్షకులకు విసుగు తెప్పించేలా వచ్చాయి. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ కనిపించిన ఈ జోనర్ ఆ తర్వాత మళ్లీ కనుమరుగయ్యింది. ఇక 1990లో కూడా తెలుగులో ఇలాంటి సినిమాలు దేవి, నాగమ్మ తదితర చిత్రాలు కూడా విడుదలయ్యాయి.
ఇప్పటి దర్శకులు అయితే ఇలాంటి జోనర్ల జోలికి ఎందుకు వెళ్లలేదంటే ఇవన్నీ కూడా అవుట్ డేటెడ్ కదలుగా మారిపోయాయి.నాడ్జిల్లా అంటూ ఇలాంటి సమయంలో మళ్లీ ఇలాంటి సినిమాలను తీసుకురావడం చూసి ఆడియన్స్ కూడా నవ్వుకుంటున్నారు. ప్రేక్షకులు ఈ మధ్య హర్రర్, థ్రిల్లర్ సినిమా జోనర్లనే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఎవరు కూడా పాములను టచ్ చేయడం లేదని ఉద్దేశంతోనే బాలీవుడ్ రిస్కు చేస్తోందని కామెడీ చేస్తున్నారు. గతంలో అయితే సర్పాలు ఎక్కువగా తిరిగేవి వీటిని జనం కూడా విపరీతంగా భయపడేవారు.. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో నాగుల చవితికి కూడా పాములు ఎక్కడా కనిపించడం లేదు మరి అలాంటి పరిస్థితులలో నాడ్జిల్లా సినిమా ఎలా ఆకట్టుకుంటుంది కార్తీక్ ఇలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నారట.