
భారీ అంచనాల నడుమ విశ్వనాథ్ సత్యనారాయణ అద్భుతమైన నవల.. ఏకవీర కథను సినిమాగా రూపొందించారు. స్వయంగా ఎన్టీఆర్.. సినారెను పాటలతో పాటు, మాటలు కూడా రాసేలా ఒప్పించాడు. మహదేవన్ సంగీతం అందించిన ఈ సినిమాకు ఎన్టీఆర్, కాంతారావు హీరోలుగా.. ఇద్దరు హీరోయిన్లను పెట్టి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌గా రూపొందించారు. ఈ సినిమా వస్తుందని ఎంతో ఆసక్తిగా ఆడియన్స్ ఎదురు చూశారు. ఇక సినిమా రిలీజై అప్పటి భాషలో వర్ణించాలంటే.. మొదటి షోకే బాక్సులు వెనక్కి వెళ్ళిపోయాయి. అది కూడా ఎన్టీఆర్ క్రేజ్ పీక్స్ లెవెల్ లో ఉన్న రోజుల్లో. ఇక బాలకృష్ణ కెరీర్ ప్రారంభంలో నటించిన మరో మూవీ అక్బర్ సలీం అనార్కలి. బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రామచంద్ర సంగీతం అందించగా.. భారీ స్టార్ కాస్టింగ్‌తో సినిమా రిలీజ్ అయింది.
ఈ సినిమాని సైతం జనాలు పక్కన పెట్టేశారు.. మరి ఈ సినిమాలకు రివ్యూలు ఎవరు చెప్పారు.. ఎవరు చెడు ప్రచారం చేశారు.. చూడవద్దని ఎవరు ట్రోల్ చేశారు.. అయినా సినిమాలు ఫ్లాపులు ఎందుకు అయ్యాయి.. అప్పుడు ఏ వెబ్సైట్‌లు ఉన్నాయి.. ఇక సూపర్ స్టార్ కృష్ణ ఇంద్రధనస్సు.. పాటలు సూపర్ హిట్, నీరాజనం సినిమా సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన మార్నింగ్ షోకే పక్కకు తప్పుకున్నాయి. ఎవరు చెప్పారని ఈ సినిమాలో ఫ్లాప్ అయ్యాయి. కనీసం మూడు రోజులైనా సినిమాలు ఆడాలి కదా అనే ప్రశ్నలు మొదలైపోయాయి.
ఇక టాలీవుడ్ జనాలు చెప్పేది ఎలాంటి రివ్యూలు లేకుండా.. ఏ ట్రోలింగ్స్ లేకుండా ఉంటే జనం మూడు రోజులు కచ్చితంగా సినిమాలు చూస్తారు. ఆ లోగా పెట్టుబడి వెనక్కి వచ్చేస్తాయి.. ఎందుకంటే ఎలాగో రేట్లు ఎక్కువ పెట్టేసి టికెట్ల పరంగా గుంజేస్తారు కదా అని. కానీ.. మరి ఆ రోజుల్లో ఎందుకు మార్నింగ్ షోకే డబ్బాలు వెనక్కు తిరిగి వచ్చేసాయి.. జనాలకు ఎవరూ చెప్పకుండానే, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా లేకుండానే సినిమాలు ఫ్లాపులుగా ఎందుకు మిగిలాయి.. కారణం.. కంటెంట్. సినిమా సక్సెస్ కు షార్ట్ కట్లు ఉండవు. కంటెంట్ బాగుంటే ఆటోమెటిగ్గా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. కాలం మారిపోతున్న రోజుల్లో ఇంకా రివ్యూల వల్ల సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి నిర్మాతలకు నష్టం కలుగుతుంది అంటూ చెప్పడం.. ఇప్పటికీ రివ్యూ ఆపేయాలని ప్రయత్నించట్ అమాయకత్వమే అవుతుంది.