టాలీవుడ్ డేరింగ్ అండ్ డేషింగ్‌ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎలాంటి ఇమేజ్‌తో దూసుకుపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన స్పెషాలిటీ ఏంటంటే.. దర్శకుడిగా కథను ఎంత స్పీడ్ గా రాస్తాడో.. హీరోస్‌ను ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒప్పిస్తాడో అంతే వేగంగా సినిమాను తెరకెక్కించి సక్సెస్‌లు అందుకుంటూ ఉంటాడు. అయితే.. ఇటీవల కాలంలో అయన వరుసగా ఫ్లాప్‌లు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ మరోసారి దర్శకుడుగా త్రో బ్యాక్ అవ్వడం కష్టమేనని.. ఏ హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి ఒప్పుకోరంటు రకరకాల అభిప్రాయాలు సోషల్ మీడియా వేదికగా వినిపించాయి.
 

అయితే ఎట్టకేలకు పూరి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి మంచి కథను వినిపించి ఆయనతో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నారు. కాగా ఈ సినిమా కోసం విజయ్ సేతుపతి పూరి జగన్నాథ్ కు టార్గెట్ పెట్టాడట‌. ఆ టార్గెట్ లోపే సినిమా పూర్తి అవ్వాలని ఆయన షరతులు విధించినట్లు సమాచారం. ఇంతకీ ఆ టార్గేట్ ఏంటో కాదు.. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలని.. డెడ్లైన్ ఇచ్చాడట. అంటే దాదాపు 60 రోజుల్లో సినిమా పూర్తి చేసేయాలని ఆయన వివరించాడట. ప్రస్తుతం విజయసేతుపతి ఫుల్ బిజీగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ సైతం ఆయన పెట్టిన డెడ్లైన్ కు సినిమాను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.

 

ఇక విజయ్ కి కథ నచ్చి ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలన్నింటినీ పక్కనపెట్టి మరి ఈ సినిమా కోసం కాల్ షీట్లు ఇచ్చినట్లు సమాచారం. అందుకే పూరి కూడా విజయ్ సేతుపతి పెట్టిన డెడ్లైన్లు సినిమా క్లోజ్ చేయాలని పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వరకు దాదాపు పూర్తయిందని.. డైలాగ్ వెర్షన్ తో సహా స్క్రిప్ట్ రెడీ అయిపోయినట్లు తెలుస్తోంది. షెడ్యూల్స్ వేసుకొని సినిమాకు కొబ్బరికాయ కొట్టడమే ఆలస్యం.. సర్వే గంగా షూటింగ్ను పూర్తి చేసి.. సినిమా రిలీజ్ చేసేలా పూరి ప్లాన్ చేస్తున్నాడట. ఇక సినిమాకు దగ్గర టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక సినిమాలో విజయ్ ఓ బిచ్చగాడిగా కనిపించబోతున్నాడు.. అందుకే ఈ టైటిల్ ని ఫిక్స్ చేయాలని టీం భావిస్తున్నారట‌. అలా అన్ని అనుకున్న స‌మ‌యానికి అయితే ఏడాది చివర్లోనే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు టీం.

మరింత సమాచారం తెలుసుకోండి: