టాలీవుడ్ మహానటిగా తిరుగులేని ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న కీర్తి సురేష్.. తన నటనకు నేషనల్ అవార్డును కూడా దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే.. గ‌త‌ కొంతకాలంగా టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. కోలీవుడ్, బాలీవుడ్ లో మాత్రం పలు సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. ఇక ఇప్పటికే బాలీవుడ్ లో గ్లామర్ డోస్‌ పెంచేసి మరి నటించిన సంగతి తెలిసిందే. పెళ్లయిన తర్వాత అమ్మడు గ్లామర్ షోలకు దూరంగా ఉంటుందని అంతా భావించారు. కానీ.. కీర్తి సురేష్ మాత్రం దీనికి భిన్నంగా ముందుకంటే మరింతగా గ్లామర్ షోలు చేస్తూ రెచ్చిపోతుంది.
 

ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత మొదటిసారి ఒక హాలీవుడ్ స్టార్ హీరో తో కీర్తి రొమాన్స్ చేయబోతుందంటూ న్యూస్ వైర‌ల్ అవుతుంది. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు సూర్య. చివరగా లక్కీ భాస్కర్ లాంటి బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఓ సినిమా నటించేందుకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు.. 796 సిసి టైటిల్ పరిశీలనలో ఉంది. మారుతి కార్లు భారతదేశానికి తీసుకువచ్చే ప్రయత్నం నేపథ్యంలో ఈ కథ సాగుతుందని సమాచారం. ఈ క్రమంలోనే మారుతి ఇంజిన్ కెపాసిటీని సూచించే 796సిసి కోడ్ టైటిల్ గా భావిస్తున్నారట. ఇక సూర్యకు బయోపిక్స్‌ అంటే ప్రత్యేక అభిమానం.

 

ఈ క్రమంలోనే ఆకాశమే నీ హద్దురా సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు ఎన్నో అవార్డులు రివార్డులను సైతం దక్కించుకున్నారు. ఈ బాటలోనే మరోసారి వెంకీ అట్లూరి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ కనిపించనుందని.. దర్శక, నిర్మాతలు ఆమె అయితేనే సినిమాకు పర్ఫెక్ట్ ఛాయిస్ అని భావిస్తున్నట్లు సమాచారం. గతంలో వెంకీ అట్లూరి డైరెక్షన్లో కీర్తి రంగ్‌దే సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే సూర్య, కీర్తిల జోడి అయితే ఆడియన్స్‌కు ఫ్ర‌ష్ ఫీల్ కలుగుతుందని వెంకీ ఆలోచన చేశాడట. దీనికి.. కీర్తి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్‌ నడుస్తుంది. మే 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని.. త్వరలోనే ఈ కాంబోకి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా టీం రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: