ప్రభాస్ నటించిన ఫాజీ మూవీ హీరోయిన్ ఇమాన్వీ ఇస్మాయిల్ పై గత 24 గంటల నుండి సోషల్ మీడియా వ్యాప్తంగా ఎంత పెద్ద నెగెటివిటీ వచ్చిందో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా పహల్ గామ్ లో జరిగిన ఉగ్రదాడి కారణంగా పాకిస్తాన్ కి చెందిన ఎవరూ కూడా భారత్ లో ఉండకూడదు అని మోడీ తేల్చి చెప్పేశారు. ఇక ఈ విషయం మోడీ తెలియజేయడం కంటే ముందే ప్రభాస్ ఫాజీ మూవీలో నటిస్తున్న హీరోయిన్ ఇమాన్వీ ఇస్మాయిల్ ని దేశం వదిలి పారిపోవాలని,అలాగే ఫౌజీ సినిమాలో హీరోయిన్ గా మరో నటిని తీసుకొని ఇమాన్వి ఇస్మాయిల్ ని అందులో నుండి తొలగించాలి అని, ఆమె పాకిస్తాన్ దేశానికి చెందిన అమ్మాయి అని, అలాంటి పాకిస్తానీ అమ్మాయిని మన ఇండియన్ సినిమాలో వద్దు అని,ఇండియన్ సినిమాల నుండి వెంటనే ఆమెను బహిష్కరించాలి అని,ఆమె తండ్రిపాకిస్థాన్ మాజీ మిలిటరీ అధికారి.. 

అలాంటి అమ్మాయిని ఈ సినిమాలో తీసుకోవద్దు అంటూ పెద్ద ఎత్తున ఇమాన్వీ ఇస్మాయిల్ పై దుష్ప్రచారం జరిగిన సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా తనపై జరిగిన దుష్ప్రచారంపై క్లారిటీ ఇస్తూ ఓ పోస్టు షేర్ చేసింది ఇమాన్వి ఇస్మాయిల్. ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టింది. గత కొద్ది గంటల నుండి నా మీద దుష్ప్రచారం జరుగుతుంది. మీరందరూ నాది పాకిస్తాన్ అనుకుంటున్నారు. కానీ నేను పాకిస్థానీని  కాదు.నేను పాకిస్తాన్లో పుట్టలేదు.మా నాన్న పాకిస్తానీ మిలిటరీ అధికారి కూడా కాదు. నేను లాస్ ఏంజెల్స్ లో పుట్టాను.అలాగే మా ఫ్యామిలీ మొత్తం అమెరికాకి చెందిన వాళ్లే అమెరికా లోనే మా ఫ్యామిలీ ఉంటున్నారు.

మా ఫ్యామిలీ అమెరికాకు వలస వచ్చారు. వాళ్ళు ఎప్పటికీ అమెరికాకు చెందిన పౌరులే..  మా నాన్న పాకిస్తాన్ ఆర్మీలో పనిచేయలేదు. దయచేసి ఇప్పటికైనా నామీద ఈ చెడు ప్రచారాన్ని ఆపుతారని ఈ పోస్ట్ చేశాను. ఇండియా నా కలను గుర్తించి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చింది. అలాంటి భారతదేశాన్ని నేను ఎప్పటికీ గౌరవిస్తాను.ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలను ఎన్నటికీ మర్చిపోను అంటూ ప్రభాస్ ఫాజీ మూవీ హీరోయిన్ ఇమాన్వీ ఇస్మాయిల్ ఆ పోస్టులో తెలియజేసింది.ఇక ఇమాన్వి ఇస్మాయిల్ పోస్ట్ తో ఆమె పాకిస్తాన్ అమ్మాయి కాదు అని అందరికీ క్లారిటీ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: