
ఈ విషయాన్ని రాజమౌళి రివిల్ చేయకున్నా.. గ్లోబల్ లెవెల్లో రూపొందిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబును ఢీకొట్టే ప్రతి నాయకుడు కూడా అదే లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేశాడని.. అయితే దీనిని కావాలనే జక్కన్న గోప్యంగా ఉంచినట్లు సమాచారం. ఇక ఓ నల్లజాతీయుడు హాలీవుడ్ లో ఇమేజ్ ఉన్న నటుడు.. మూవీలో విలన్ గా కనిపించనున్నాడట. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగుతున్న ఈ కథలో.. అదే ప్రాంతానిక చెందిన వ్యక్తి విలన్ గా కనిపించనున్నాడని టాక్. అయితే ఆ నటుడు ఎవరనేదాన్ని మాత్రం జక్కన్న ఇంకా సీక్రెట్ గానే ఉంచాడట. ప్రతి నాయకుడు పాత్ర విషయంలో ఇలాంటి సీక్రెట్స్ మైంటైన్ చేయడం జక్కన్నకు అలవాటే.
బాహుబలి లో పెద్దగా ఆడియన్స్ కు పరిచయం లేని ప్రభాకర్‌ను కాలకేయ పాత్రలో నటింపజేసాడు. ఈ సినిమాతో ప్రభాకర్‌కు తిరుగులేని ఇమేజ్ ఏర్పడింది. ఇక రాజమౌళి గతంలో తెరకెక్కించిన విక్రమార్కుడు సినిమాలోను కేవలం చిన్న పాత్రలో నటించే అజయ్‌నీ టిట్లా పాత్రలో పవర్ఫుల్ విలన్ గా నటింపచేసాడు. ఇక ఈ సినిమా తర్వాత అజయ్ కు విపరీతమైన పాపులారిటీ ఏర్పడింది. అలాగే ఆర్‌ఆర్ఆర్ సినిమా లోను తెల్లజాతీయులు విలన్ గా కనిపించిన సంగతి తెలిసిందే. అప్పటివరకు అసలు వాళ్ళు ఎవరో కూడా ప్రపంచానికి పరిచయం లేని వాళను విలన్ గా తీసుకొని సినిమా హిట్ కొట్టాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు అదే లక్కీ స్ట్రాటజీ ఎస్ఎస్ఎంబి 29 కు కూడా జక్కన్న వాడుతున్నాడట.