
అయితే ఇదంతా కూడా బిగ్ బాస్ షో ముందు వరకు అన్నట్లుగా తెలుస్తోంది. కానీ హౌస్ లో నిఖిల్ తన లవ్ ఫెయిల్యూర్ అయ్యిందని తనకు ఆ అమ్మాయి కావాలని ఉందని చెబుతూ ఎమోషనల్ గా మాట్లాడారు. కానీ ఎక్కడ కూడా కావ్య పేరు చెప్పలేదు. ఒక బిగ్ బాస్ షో తర్వాత నిఖిల్ కూడా సీరియల్ లో తప్ప కావ్యతో కలిసి ఎక్కడ కూడా కనిపించడం లేదు. వీళ్లకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉండడంతో అభిమానులకు కూడా ఈ జంట ను ట్యాగ్ చేస్తూ అప్పుడప్పుడు పలు రకాల పోస్టులు షేర్ చేస్తూ ఉంటారు.
దీప తాజాగా నిఖిల్ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టడం జరిగింది. నిఖిల్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ... అందరి వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నారని కానీ తన యొక్క రిక్వెస్ట్ అంటూ.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి ఎవరి జీవితాలలో వారు బిజీగా ఉన్నారు కాబట్టి మమ్మల్ని వ్యక్తిగతంగా సపోర్ట్ చేసి ప్రేమించండి మేము చేయవలసిన పనులు చాలా ఉన్నాయి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను అంటూ నన్ను ఎవరితో ట్యాగ్ చేయకండి తెలియజేశారు నిఖిల్. ఇకమీదట తనని ఎవరితో కూడా లింకు చేయకండి ట్యాగ్ చేయకండి అంటూ తెలిపారు. దీంతో నిఖిల్ కావ్య ఇద్దరు కూడా విడిపోయారు అనే విధంగా క్లారిటీ వచ్చేసిందని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.