అలనాటి అందాల తార రమ్యకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ చిన్నది ఒకానొక సమయంలో లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. రమ్యకృష్ణ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తోంది. ఈ చిన్నది ఒకానొక సమయంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని తన ఒంటి చేతితో నడిపించిందని చెప్పవచ్చు. తన సినిమాలతో ప్రేక్షకులను మైమరపించింది. తన నటన, అందచందాలతో ఎన్నో సినిమాలలో అవకాశాలను అందుకుంది. రమ్యకృష్ణతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూలో ఉండేవారు. ఇక ఈ బ్యూటీ ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. ఇక రమ్యకృష్ణ హీరోయిన్ గా కాకుండా ఇప్పుడు కేవలం అత్త, తల్లి వంటి పాత్రలను పోషిస్తూ మంచి గుర్తింపు అందుకుంటుంది. రమ్యకృష్ణ కు కోట్లాది సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.... రమ్యకృష్ణకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారుతుంది. ఆమె కెరీర్ ప్రారంభంలో రమ్యకృష్ణ కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొందట. నరసింహ సినిమా అనంతరం రమ్యకృష్ణ వరుసగా సినిమాల్లో అవకాశాలను దక్కించుకుందట.

అయితే రమ్యకృష్ణ కెరియర్ స్టార్టింగ్ లో చాలామంది తనకు సినిమా అవకాశాలను ఇప్పిస్తానని కొంతమంది మోసం కూడా చేశారట. ఇక ఈమె ఓ సినిమాలో నటిస్తున్న సమయంలో హీరో తన నడుము పట్టుకునే రొమాంటిక్ సీన్ ఉందట. ఆ సమయంలో ఆ హీరో తన నడుమును గట్టిగా నొక్కాడట. అప్పుడు రమ్యకృష్ణ చాలా ఇబ్బందిగా ఫీల్ అయిందట. ఈ విషయాన్ని రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం రమ్యకృష్ణ షేర్ చేసుకున్న ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: