ఆర్తి అగర్వాల్ ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన నటనతో ఎంతో గొప్ప పేరు తెచ్చుకుంది. తన నటన, అందచందాలతో ప్రేక్షకుల మనసులను కట్టిపడేసింది. ఈ చిన్నది ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా చేసింది. రాజశేఖర్, ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి, తరుణ్, వెంకటేష్ లాంటి ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటించే అవకాశాలను పొందింది. తన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఎన్నో అవార్డులను సైతం పొందింది. ఇక కొన్ని సంవత్సరాల తర్వాత ఆర్తి అగర్వాల్ కు సినిమాల్లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. 

దానికి గల ప్రధాన కారణం ఆమె కొన్ని మానసిక సమస్యల కారణంగా 2005లో క్లీనింగ్ కెమికల్ తాగి సూసైడ్ చేసుకుంది. ఆ తర్వాత వైద్యులు ఆమెను ప్రాణాలతో కాపాడారు. అనంతరం అదే సంవత్సరం తన ఇంట్లోనే మెట్లపై నుంచి కిందకు పడిపోయింది. అప్పుడు కూడా తన ప్రాణాలను కాపాడుకుంది. ఇక 2007లో న్యూజెర్సీకి చెందిన ఉజ్వల్ నికమ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అనంతరం వ్యక్తిగత సమస్యల కారణంగా విడాకులు తీసుకున్నారు. వారి వైవాహిక జీవితం మధ్యలోనే ఆగిపోయింది. అంతేకాకుండా సినిమాల్లో కూడా పూర్తిగా అవకాశాలు కోల్పోయింది. విపరీతంగా బరువు పెరగడంతో సినిమాలలో అవకాశాలు ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలేకపోయారు.

బరువు తగ్గడానికి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ అవి ఏమీ ఫలించలేదు. ఆ తర్వాత తాను సర్జరీ చేయించుకోవాలని నిర్ణయం తీసుకుంది. అప్పటికే ఆర్తి అగర్వాల్ స్థూలకాయం, శ్వాసకోస సమస్యలతో బాధపడుతూ 2017 జూన్ 4న అమెరికాలోని అట్లాంటిక్ సిటీలో లైపో సక్షన్ సర్జరీ చేయించుకుంది. ఆ సర్జరీ ఫెయిల్ కావడం మరియు గుండెపోటుతో తన ప్రాణాలను కోల్పోయింది. ఆర్తి అగర్వాల్ మరణ వార్త విని కుటుంబ సభ్యులు తీవ్రంగా బాధపడ్డారు. తన అభిమానులు సైతం ఆర్తి అగర్వాల్ మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. అగర్వాల్ సినీ ఇండస్ట్రీలో లేకపోవడం నిజంగా బాధాకరం. ఈమె లేని లోటును ఎవరూ తీర్చలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: