టాలీవుడ్ నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ చిన్నది ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేని కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. అతి తక్కువ సమయంలోనే తన నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. తన నటన, అందచందాలతో అనేక సినిమాలలో అవకాశాలను అందుకుంది. ఇప్పటివరకు సమంత.... నాగచైతన్య, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లాంటి ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తోంది. తన కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి తన అభిమానులను ఆకట్టుకుంటుంది. 

సమంత తన కెరీర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే వీరిద్దరూ మనస్పర్ధల కారణంగా విడిపోయారు. అనంతరం సమంత ఎప్పటిలానే వరుసగా సినిమాలు చేసుకుంటూ తన లైఫ్ ను చాలా హ్యాపీగా కొనసాగిస్తుంది. ఇక నాగచైతన్య మాత్రం రెండవ వివాహం చేసుకొని చాలా సంతోషంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సమంత రెండో పెళ్లికి సిద్ధమయ్యారని.... తొందరలోనే వివాహం చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో రోజుకో వార్త వైరల్ గా మారుతూనే ఉన్నాయి.

రాజ్ నిడుమోరుతో సమంత సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తుందని వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే సమంత రీసెంట్ గా శ్రీకాళహస్తి గుడికి వెళ్లారు. అక్కడ దేవుడిని దర్శనం చేసుకున్న అనంతరం రాహు కేతువు పూజలు చేసింది. అయితే సమంత గత 12 సంవత్సరాల క్రితం కూడా ఇలానే రాహు కేతువు పూజలు చేసిందట. ఈ విషయం తెలిసిన అనంతరం సమంత నిజంగానే రెండో పెళ్లికి సిద్ధమైందని అంటున్నారు. ఆ పూజలు చేస్తూ సమంత తన అభిమానులకి ఇలా రెండో వివాహానికి సిద్ధమైనట్టుగా హింట్ ఇస్తుందని కొన్ని రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: