మెగా కుటుంబం నుంచి సినీ ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోలు పరిచయమయ్యారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఒకరు. ఈ హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతి తక్కువ సమయంలోనే పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా చక్రం తిప్పారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్నారు. ఓవైపు సినిమాలలో హీరోగా నటిస్తూనే మరోవైపు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను చేపట్టిన అనంతరం ఫుల్ బిజీగా ఉంటున్నారు. 

తాను డిప్యూటీ సీఎం కాకముందు ఒప్పుకున్న సినిమా షూటింగ్ లలో సమయం దొరికినప్పుడు మాత్రమే పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో వారం రోజులపాటు కంటిన్యూగా షూటింగ్ చేశారు. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నందుకు భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారట. ఏకంగా పవన్ కళ్యాణ్ 170 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. అది కూడా రీజనల్ గా అని తెలుస్తోంది. ఈ మొత్తం ఆల్ టైమ్ రికార్డ్ అని సమాచారం అందుతుంది. కాగా, తెలుగులో ఇప్పటివరకు ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకున్న హీరో మరొకరు లేరు.

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, pspk 29 సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తనకు సమయం కుదిరినప్పుడల్లా సినిమా షూటింగ్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. కాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అతి తొందరలోనే రిలీజ్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. వారి కోరిక మేరకే ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ లో ఉన్నారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి ఈ సినిమా వస్తున్న సందర్భంగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని తన అభిమానులు ఎంతగానో ఆకాంక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: