ఘట్టమనేని మహేష్ బాబు ఈ హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కృష్ణ వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన మహేష్ బాబు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అతి చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తనదైన నటన, హ్యాండ్సమ్ లుక్ తో ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. ముఖ్యంగా యూత్ లో మహేష్ బాబుకి విపరీతంగా ఫ్యాన్స్ ఉండడం విశేషం. ఈ హీరో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ తన ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ఇక మహేష్ బాబు తన కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించాడు. అందులో అతడు సినిమా ఒకటి. 

సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 20 ఏళ్లు కావస్తున్న సందర్భంలో అతడు మూవీ ప్రొడ్యూసర్ టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీమోహన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ మహేష్ బాబు కాదని సంచలన కామెంట్లు చేశారు. అయితే ఈ సినిమాలో మొదటగా హీరోగా ఉదయ్ కిరణ్ ని అనుకున్నామని వెల్లడించాడు. మొదటి నుంచే ఉదయ్ కిరణ్ ని నేను చాలా దగ్గర చేసేవాడిని. తరచుగా ఉదయ్ కిరణ్ నా దగ్గరికి వచ్చి కలుస్తూ ఉండేవాడని మురళీ మోహన్ చెప్పారు.

అదే సమయంలో ఉదయ్ కిరణ్ తో అతడు సినిమా చేయాలని అనుకున్నట్టుగా వెల్లడించారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ సినిమాను ఉదయ్ కిరణ్ తో కాకుండా మహేష్ బాబుతో చేసినట్టుగా వెల్లడించారు. ఈ సినిమాతో మహేష్ బాబు మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మురళీమోహన్ షేర్ చేసుకున్న ఈ విషయాలు సంచలనంగా మారుతున్నాయి. కాగా,  మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 29 సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా సమయం పట్టేలా ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటికి రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: