సింగర్ సునీత ఈ మధ్యకాలంలో వివాదంలో చిక్కుకోవడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఈమె పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. జూనియర్ సింగర్ అయినటువంటి ప్రవస్తీ పాడుతా తీయగా జడ్జిగా చేసిన సీనియర్ సింగర్ సునీత పై ఆరోపణలు చేయడంతో సినీ ఇండస్ట్రీ మొత్తం ప్రవస్తిపై మండిపడుతున్నారు. అంతేకాదు ఆ షో కి వర్క్ చేసినవాళ్లు.. సింగర్స్ ఇలా ప్రతి ఒక్కరు కూడా ప్రవస్తిదే తప్పు అని మాట్లాడుతున్నారు. కానీ ప్రవస్తి మాత్రం తాను చేసిన దాంట్లో తప్పేమీ లేదని సునీత నిజ స్వరూపం బయట పెడతానంటూ షాకింగ్ వీడియోలు రిలీజ్ చేస్తుంది. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న సునీత గురించి మరో వీడియో వైరల్ అవుతుంది. 

అయితే ఆ వీడియోలో ఆ హీరోని చూడగానే టెంప్ట్ అయిపోతా అంటూ సింగర్ సునీత మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. మరి ఇంతకీ సింగర్ సునీతకి ఇష్టమైన హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. చాలా మంది సెలబ్రిటీలకు ఫస్ట్ క్రష్ అనేది ఉంటుంది. అలా సింగర్ సునీతకి కూడా ఫస్ట్ క్రష్ ఉన్నారట.అది కూడా ఓ బాలీవుడ్ హీరో.. అయితే కొంతమంది సెలబ్రిటీలు కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు తమ గురించి పర్సనల్ విషయాలను బయటపెడుతూ ఉంటారు. అలా సింగర్ సునీత కూడా కమెడియన్ అలీ హోస్ట్ గా చేసిన్న ఆలీతో సరదాగా అనే షోలో పాల్గొన్నప్పుడు మీ ఫస్ట్ క్రష్ ఎవరు అని ప్రశ్నించగా.. నా ఫస్ట్ క్రష్ జాకీ ష్రాఫ్..

ఆయనకు నాకు వయసులో వ్యత్యాసం ఉన్నప్పటికీ చిన్నప్పటినుండి ఆయన అంటే ఎందుకో చెప్పలేనంత ఇష్టం. ఆయనని మొదటిసారి చూసినప్పుడే టెంప్ట్ అయిపోయాను. అదేంటో తెలియదు కానీ తొలిచూపులోనే ఆయన మీద ప్రేమ పెరిగిపోయింది అంటూ నవ్వుతూ సింగర్ సునీత తన ఫస్ట్ క్రష్ పేరు బయట పెట్టింది. ఇక అదే షోలో ఆలీ జాకీ ష్రాఫ్ గురించి మాట్లాడుతూ జాకీ ష్రాఫ్ సినిమాల్లోకి రాకముందు వీధి రౌడీగా పని చేసేవారు. అలా వచ్చిన డబ్బులతోనే జీవించేవారు అంటూ చెప్పారు. ఇక ఆ మాటలకు సునీత రియాక్ట్ అవుతూ.. ఆయన ఏ పని చేస్తే ఏంటి నా మనసు మాత్రం దోచుకున్నారు అంటూ మాట్లాడడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: