నాని పెర్ఫార్మన్స్ , ఎంటర్తైనింగ్ ఫస్ట్ హాఫ్ , లొకేషన్స్ అండ్ సినిమాటోగ్రఫీ , సాంగ్స్ అండ్ పిక్చరైజేషన్ , విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ , మెహరీన్ నటన నాని పెర్ఫార్మన్స్ , ఎంటర్తైనింగ్ ఫస్ట్ హాఫ్ , లొకేషన్స్ అండ్ సినిమాటోగ్రఫీ , సాంగ్స్ అండ్ పిక్చరైజేషన్ , విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ , మెహరీన్ నటన సెకండాఫ్ లోని సాగదీత , ఓల్డ్ ఫార్మాట్ లో స్టొరీ , అవసరం లేకుండా వచ్చే సాంగ్స్ , ఎడిటింగ్

15 ఏళ్ళ క్రితం రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కథ మొదలుతుంది.. హిందూపూర్ లోని ఓ సిటీలో కథ జరుగుతుంది. కృష్ణ(నాని) నందమూరి బాలకృష్ణకి వీరాభిమాని, కానీ మనోడికి ఉన్న సమస్యల్లా చిన్నతనం నుంచి తను చాలా భయస్తుడు, పిరికివాడు. కానీ భయటకి మాత్రం అందరికీ పెద్ద పోటుగాడు అని బిల్డప్ ఇస్తూ తిరుగుతుంటాడు. చిన్నప్పటి నుంచే క్రిష్ణగాడు ఆ ఊరి ఫ్యాక్షన్ కింగ్ రామరాజు వారసురాలైన మహాలక్ష్మీ(మెహరీన్)తో స్నేహం ఉంటుంది, ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారి 15 ఏళ్ళ నుంచి ప్రేమించుకుంటూ ఉంటారు. కానీ నానికి ఉన్న భయం వలన మహాలక్ష్మీ ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి భయపడుతూ ఉంటాడు. ఫైనల్ గా చెప్పాల్సిన సందర్భం వస్తుంది, చెబుదాం అని వెళ్తాడు. అప్పుడే ఓల్డ్ మాఫియా డాన్ అయినడేవిడ్ తన మదర్ చివరి కోరిక తీర్చడానికి హైదరాబాద్ వస్తాడు. అదే టైంలో రామరాజు ఇంట్లో ఎసిపి శ్రీకాంత్(సంపత్) ముగ్గురు పిల్లలు కిడ్నాప్ అవుతారు. ఇక అక్కడు నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ కిడ్నాప్ కి కృష్ణకి ఉన్న సంబంధం ఏమిటి? అలాగే డాన్ డేవిడ్ మదర్ చివరి కోరిక ఏమిటి? చివరికి కృష్ణ - మహాలక్ష్మీల ప్రేమ ఏమైంది? అన్నదే మిగిలిన కథ..    

నటీనటుల్లో మొదటగా హీరో నుంచి మొదలు పెడితే.. హను రాసుకున్న కథకి నానినే పర్ఫెక్ట్, అతను తప్ప ఇంకెవ్వరూ ఈ కథకి న్యాయం చేయలేరు. ఎందుకంటే తన ఎనర్జిటిక్ అండ్ నాచురల్ నటనే ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యింది. ఎప్పటిలానే తన మార్క్ డైలాగ్ డెలివరీతో బాగా ఆకట్టుకున్నాడు. అలాగే సెకండాఫ్ లో కనిపించే ముగ్గురు పిల్లల పెర్ఫార్మన్స్ సూపర్బ్, అలాగే వీరితో కలిసి నాని చేసిన అల్లరి బాగా నవ్విస్తుంది. ఇక హీరోయిన్ మెహరీన్ విషయానికి వస్తే.. సినిమా మొత్తం హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంది. కానీ హీరోయిన్ కి కాస్త ప్రాధాన్యత తక్కువ ఉంది. అది పక్కన పెడితే మేహరీన్ మాత్రం మొదటి సినిమాతోనే ఆకట్టుకుంది. సంపత్ రాజ్ ఎసిపి పాత్రలో మెప్పించాడు. సత్యం రాజేష్, ప్రభాస్ శీను, బ్రహ్మాజీల కామెడీ సింప్లీ సూపర్బ్, వీరి నటన, వీరి వన్ లైన్ డైలాగ్స్ భీభత్సంగా పేలాయి. రామరాజు, శత్రు, మురళి శర్మ, హరీష్ ఉత్తమన్, రవి కాలే లాంటి వారు నెగటివ్ పాత్రల్లో జీవించారు. వీరి తర్వాత చిన్న పిల్లలైన బేబీ నయన, మోక్ష, శ్రీ ప్రతంలు బాగా చేసారు. 

కృష్ణగాడి వీర ప్రేమగాథ చాలా స్పీడ్ గా మొదలవుతుతుంది, ఎంటర్టైన్ గా కూడా సాగుతుంది.. ఒక స్టేజ్ తర్వాత ట్విస్ట్ లు రివీల్ అవ్వడం మొదలవ్వగానే సినిమా స్లో అయిపోతుంది, డ్రాగ్ అవుతూ ఉంటుంది. చెప్పాలంటే ఎన్నో తెలుగు సినిమా సక్సెస్ఫుల్ కథలని ఇందులో మిస్క్ చేసారు. దీని ఓవరాల్ థీమ్ చాలా పాతదే అయినా సినిమా బేసిక్ లైన్ మరియు గ్రిప్పింగ్ గా చెప్పడం బాగుంటుంది. డైరెక్టర్ సినిమాని పాసబుల్ అయ్యేలా తీసాడు. 


'అందాల రాక్షసి'తో డైరెక్టర్ అయిన హను రాఘవపూడి నుంచి వచ్చిన రెండవ సినిమా ఇది. ఆ సినిమా చూడటానికి విజువల్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నప్పటికీ సినిమా మాత్రం చాలా స్లోగా, మెయిన్ గా సెకండాఫ్ అయితే సాగుతూనే ఉంటుంది. ఇదే మిస్టేక్ ని హను తన రెండవ సినిమా కృష్ణగాడి వీర ప్రేమగాథ లోనూ చేసాడు. కానీ సినిమాలో ఎంటర్టైన్మెంట్ అనే పాళ్ళు కాస్త ఎక్కువగా ఉండేలా చూసుకున్నాడు.


ఇప్పుడు హను కథా పరంగా చూసుకుంటే ఇంటర్వెల్ ఎపిసోడ్ తర్వాత నాని మేహరీన్ ని ఒక పెళ్లి ఫంక్షన్ లో కలవడంతో సినిమా అయిపోవాలి. కానీ డైరెక్టర్ అక్కడి నుంచి ఒక కారణం అనేది లేకుండా సినిమాని సాగదీసాడు. అసలు సంబంధం లేకుండా చిత్ర విచిత్రమైన సీన్స్ ని సెకండాఫ్ మొత్తాన్ని సాగదీశారు. కానీ అక్కడ కూడా సినిమాని సేవ చేసింది కామెడీనే.. సత్యం రాజేష్, బ్రహ్మాజీ, పృధ్వీ, ప్రభాస్ శీనుల పంచ్ లైన్స్ ఆడియన్స్ పెదవులపై నవ్వును జెనరేట్ చేస్తూ ఉండడమే సినిమాకి ప్లస్ అయ్యింది. అలాగే హను చాలా మెయిన్ పాయింట్స్ ని పక్కన పడేసాడు.. మొదటగా రామరాజు ఇంటిమీద అటాక్ తర్వాత మేహరీన్ ని కిడ్నాప్ చేస్తారు, కానీ మేహరీన్ ని ఎవ్వరూ పట్టించుకోరు. నాని చెప్తున్నా ఎసిపి సంపత్ కూడా లైట్ తీసుకుంటాడు. అలాగే నానితో పాటు పిల్లలు ఎందుకు ఉన్నారు అనేది ఆలోచించడి మానేసి వాళ్ళని ఎవరో కిడ్నాప్ చేస్తారని టెన్షన్ పడుతుంటుంది.మొత్తంగా చూసుకుంటే హను డైరెక్టర్ గా ఫస్ట్ హాఫ్ ని బాగా డీల్ చేసాడు కానీ సెకండాఫ్ లో జస్ట్ బిలో యావరేజ్ అనిపించాడు. క్లైమాక్స్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. 


ఇక యువరాజ్ సినిమాటోగ్రఫీ అదిరింది. ప్రతి ఫ్రేం, ప్రతి విజువల్, ప్రతి లొకేషన్ ని పిక్చర్ పర్ఫెక్ట్ గా హూపాడు. అందుకనే కొన్ని చోట్ల సీన్ బాలేకపోయినా లొకేషన్స్ అట్రాక్ట్ చేస్తాయి. విజువల్స్ తగ్గట్టుగా విశాల్ చంద్రశేఖర్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు, ఆ పాటలని షూట్ చేసిన విధానం సూపర్బ్. నేపధ్య సంగీతం కూడా చాలా బాగుంది. ఎంఆర్ వర్మ ఎడిటింగ్ జస్ట్ యావరేజ్.. సెకండాఫ్ లో ఎక్కడో ఆయన మిస్ లీడ్ అయ్యి సినిమాని సాగదీసేసాడు. విజయ్ యాక్షన్ ఎపిసోడ్స్ నానికి తగ్గట్టుగానే ఉన్నాయి. అవినాష్ కొల్లా ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. అలాగే 14 రీల్స్ వారి నిర్మాణ విలువలు చాలా చాలా బాగున్నాయి. ఈ ప్రొడక్షన్ విలువలే సినిమాని చాలా వరకూ కాపాడాయి.   


కృష్ణగాడి వీర ప్రేమగాథ' మన తెలుగు ఎంటర్టైన్మెంట్ అనే ఫార్ములాని బేస్ చేసుకొని వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. లవ్ స్టోరీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా చాలా బాగా నచ్చేస్తుంది. 'ఒక భయస్తుడు తన ప్రేమ కోసం ప్రేయసిని ఎలా ఒప్పించాడు, ఎలా తన లవర్ పవర్ ఫుల్ బ్యాక్ డ్రాప్ ని ఎదుర్కొని తనని దక్కించుకున్నాడు' అన్నది పాత ఫార్ములానే కానీ మార్పు కోసం దానిని ఫాక్షన్ కామెడీ అనే ఫార్మాట్ లో ప్రెజంట్ చేసి సూపర్ సక్సెస్ అయ్యాడు. నటీనటుల మంచి నటన, కామెడీ మరియు రొమాంటిక్ ట్రాక్ తో సాగే కృష్ణగాడి వీర ప్రేమగాథ ఈ వాలెంటైన్స్ డే కి మీ లవర్ తో కలిసి హ్యాపీ గా ఎంజాయ్ చేయదగిన సినిమా. 

Nani,Mehrene Kaur Peerzada,Hanu Raghavapudi,Ram Achanta,Gopichand Achanta,Anil Sunkara,Vishal Chandrasekharకృష్ణగాడి వీర ప్రేమగాథ - లవర్స్ డే కి వచ్చిన లవ్లీ ఎంటర్టైనర్.

మరింత సమాచారం తెలుసుకోండి: