Star cast: Kalyan Ram, Kriti Kharbanda, Nikesha Patel
Producer: Kalyan Ram, Director: Sunil Reddy
Om 3D - English Full Review
ఓం 3D రివ్యూ: చిత్రకథ
బైరెడ్డి ( రావు రమేష్ ) మరియు హర్ష వర్ధన్ ( కార్తీక్ ) మధ్యలో గొడవలు జరుగుతూ ఉంటాయి . బైరెడ్డి చేసే నేరాలను హర్ష వర్ధన్ బయట పెట్టడంతో అతని హోం మినిస్టర్ పదవి పోతుంది . హర్ష వర్ధన్ మీద పగ పెంచుకున్న బైరెడ్డి అతన్ని మట్టుపెట్టాలని ప్రయత్నిస్తుంటాడు . హర్ష వర్ధన్ కొడుకు అయిన అర్జున్ ( కళ్యాణ్ రామ్ ) బైరెడ్డి నుండి తండ్రి ని కాపాడుకుంటూ వస్తాడు. ఇదిలా ఉండగా అర్జున్,కృతి తో ప్రేమలో పడతాడు హర్ష వర్ధన్ మాత్రం రియ ( నికిష ) తో అర్జున్ పెళ్లి చెయ్యాలనుకుంటాడు . ఇదంతా భవాని ( సంపత్ ) జైలు నుండి విడుదల కాగానే మారిపోతుంది భవానితో కలిసి హర్ష వర్ధన్ ని చంపాలి అనుకున్న బైరెడ్డి నుండి అర్జున్ తన తండ్రి ని ఎలా కాపాడుకున్నాడు ? హర్ష వర్ధన్ అర్జున్ ప్రేమను ఒప్పుకున్నాడా లేదా అన్నది మిగిలిన కథ.
ఓం 3D రివ్యూ: నటీనటుల ప్రతిభ
అలనాటి తమిళ నటుడు కార్తీక్ నటనా పరంగా చాలా బాగా చేసినా అయన ఇంగ్లీష్ లో మాట్లాడే తీరు చాలా ఎబ్బెట్టుగా ఉండటం . నిఖిష పటేల్ పాత్ర ఉన్నదీ కొద్దిసేపే అయినా పరవాలేదనిపించింది కాని డబ్బింగ్ విషయంలో మరింత జాగ్రత్త వహించాల్సింది అసలు లిప్ సింక్ కుదరలేదు . హర్ష వర్ధన్ పరవాలేదనిపించాడు . సంపత్ లూక్స్ పరంగా అద్భుతంగా ఉన్న నటన కూడా బాగుంది కాని పాత్ర చూపించినంత పవర్ఫుల్ గా ఉండదు చివరికి వచ్చేసరికి తేలిపోతుంది. కళ్యాణ్ రామ్ విషయానికి వస్తే కసి మీద చిత్రాలను చేసే ఈ నటుడి నటన కూడా అంతే కసిగా ఉంటె బాగుంటుంది కాని ఈ చిత్రంలో పాత్రకు మరియు సన్నివేశానికి కావలసిన దానికన్నా ఎక్కువగా నటించేశారు ఇక ఈయన డైలాగ్ డెలివరీ గురించి చెప్పుకోవాలంటే చాలా సన్నివేశాలలో సంభాషణలు అర్ధం కూడా కావు ఈ విషయంలో మొదటి నుండి ఈ నటుడికి సమస్య ఉంది డైలాగ్ డెలివరీ కాస్త మెరుగు పరుచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ చిత్రంలో ముఖ్యం గా చెప్పుకోవాల్సిన విషయం మరోటి ఏదయినా ఉందంటే కృతి , ఈ నటి ఈ చిత్రంలోని హై లైట్స్ లలో ఒకటి తన అందాలతో ఆడియన్స్ ని ముగ్ధులను చేసింది.
ఓం 3D రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు
పాత కథ పస లేని కథనం ఆకట్టుకొని దర్శకత్వం ఇలా అన్ని విషయాలలో దర్శకుడు ఘోరంగా విఫలం అయ్యారు . సినిమాటోగ్రఫీ బాగుంది . విజువల్ గా చాలా బాగా తెరకెక్కించాలన్న తాపత్రయం కథ విషయంలో కూడా చూపించుంటే తెలుగు పరిశ్రమలో నిజంగా కొత్త పోకడ కు చిత్రం ఇది . చిత్ర నిడివి రెండు గంటలే కావడంతో ఎడిటింగ్ కి ఎక్కువ అవకాశం లేదు . మ్యూజిక్ లో ఒక పాట బాగుంది నేపధ్య సంగీతం కూడా చాలా బాగుంది . సన్నివేశాలు పాతవి అయినప్పుడు సంభాషణలు కూడా అలానే ఉంటాయి అన్నట్టుగా నే ఉన్నాయి డైలాగ్స్ కూడా . సినిమాటోగ్రఫీ చాలా బాగుంది . ప్రతి పది నిమిషాలకు వచ్చే ఫైట్స్ ఆకట్టుకోకపోగా చిరాకు తెప్పించాయి.
ఓం 3D రివ్యూ: హైలెట్స్
- కొన్ని 3డి సన్నివేశాలను అద్బుతంగా చిత్రీకరించారు
- సినిమాటోగ్రఫీ బాగుంది
- కీలక సంన్నివేశాల వద్ద బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- చిత్ర నిడివి తక్కువగా ఉండటం
ఓం 3D రివ్యూ: డ్రా బాక్స్
- పాత చింతకాయ పచ్చడి లాంటి కథ
- సెకండ్ హాఫ్ స్క్రీన్ప్లే
- కళ్యాణ్ రామ్ నటన
- కమర్షియల్ అంశాలు లేకపోవటం
ఓం 3D రివ్యూ: విశ్లేషణ
టైటిల్స్ తో ఓం అద్భుతంగానే రాసిన ఈ చిత్రం ఆసాంతం అలానే ఉంటుంది అనుకుంటే పొరపడినట్టే . కళ్యాణ్ రామ్ మంచి కసి ఉన్న నటుడు కొత్త టెక్నాలజీ ని మన ముందుకి తీసుకోస్తున్నాడు అనుకోని సినిమాకి వెళ్ళిన వారు టెక్నాలజీ ని అయితే ఆస్వాదించగలరు కాని సినిమాని కాదు. టెక్నికల్ గ చిత్రం ఎంత బాగున్న కంటెంట్ లేకపోతే ప్రేక్షకులను ఆకట్టుకోలెం అన్న చిన్న పాయింట్ ని కళ్యాణ్ రామ్ మిస్ అయ్యారు . ఇన్నిరోజులు ఏదయినా గొప్పగా చెయ్యాలంటే ఏదయినా కొత్తగా చేస్తే సరిపోతుంది అనుకునేవాడిని ఈ చిత్రం చూసాక ఏదయినా కొత్తగా చెయ్యాలంటే అది గొప్పగా ఉండాలి అని అర్ధం అయ్యింది . ఒకే ఒక్క ట్విస్ట్ చేతిలో పెట్టుకొని చివరి దాకా రివీల్ చెయ్యకూడదు అన్న దర్శకుడి ప్రయాస ఏంటో.. దీనికన్నా ఏదయినా సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చి ఉంటె కనీసం ప్రయత్నానికన్న పెరోచ్చేదేమో . నిఖిష స్కిన్ షో, కృతి ప్రెట్టి నెస్ చిత్ర ప్లస్ లో ఒకటి ఒకానొక టైం లో చిత్రంలో అన్నింటికన్నా నిఖిష స్కిన్ షో బాగుంది అనిపిస్తుంది అంటే కంటెంట్ ఎంత పూర్ గా ఉందో అర్ధం అయిపోతుంది.
తమిళ నటుడు తెలుగు డైలాగ్స్ చెప్పడానికి ఇబ్బంది పడ్డాడు అంటే ఒక అర్ధం కాని కార్తీక్ ఇంగ్లీష్ డైలాగ్స్ చెప్తున్నప్పుడు సగటు ప్రేక్షకుడికి "వాట్ ఇస్ దిస్ ?" అనిపిస్తుంది . చిత్రానికి అన్నింటికన్నా పెద్ద ప్లస్ నిడివి తక్కువగా ఉండటం . ఇక భరించలేను అని ప్రేక్షకుడు అనుకునే సమయానికి చిత్రం అయిపోడం కాస్త ఊరటనిచ్చే అంశం . నిర్మాత పెట్టిన ఖర్చు తెర మీద కనిపిస్తున్నా దీనికి ఇంత ఖర్చుపెట్టాలా ? అన్న ప్రశ్న ప్రతి మనసులో మెదులుతూనే ఉంటుంది. ఈ చిత్రాన్ని 3డి గురించి చూపించడానికే తీసినట్టు అయితే ఆ విషయంలో విజయం సాదించారు కాని కంటెంట్ విషయంలో దారుణంగా ఫెయిల్ అయ్యారు . మొన్న యాక్షన్ 3డి ఈరోజు ఈ చిత్రం సినిమా సాంకేతికంగా ఎంత ఉన్నతంగా ఉన్న విషయం లేకపోతే ఆకట్టుకోలేదు అని నిరూపించాయి ఇకనయిన దర్శకులు ఏదయినా నూతన టెక్నాలజీ ని కొంచెం విషయం ఉన్న కథతో పరిచయం చేస్తే ప్రేక్షకులు తప్పకుండ ఆదరిస్తారు.
ఓం 3D రివ్యూ: చివరగా
ఓం : సాంకేతికంగా ఉన్నతం విషయం మాత్రం పాతాళం
Review board: Cheruku Raja, Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com;
Call: +91-40-4260-1008
More Articles on Om 3D | Om 3D Wallpapers | Om 3D Videos