భీమవరంలో నివసించే రాంబాబు(సునీల్) కాస్త డిఫరెంట్ పర్సన్ ఎందుకంటే తన పెళ్లి చూపులకని వెళ్ళిన అమ్మాయికి వేరే వాళ్ళతో వెంటనే పెళ్లై పోతుంది. అలాంటి రాంబాబుకి బ్రెయిన్ ట్యూమర్ ఉంది మరో పది రోజుల్లో చనిపోతాడని తెలుస్తుంది. అప్పుడు తనికెళ్ళ భరణి చెప్పిన కొన్ని నీతి వాక్యాల వల్ల హైదరాబాద్ వచ్చి అక్కడ ప్రజల్ని టార్చర్ చేస్తున్న రౌడీలని ఎదిరించడం మొదలు పెడతాడు. ఆ ప్రయాణంలోనే నందిని(ఎస్తర్) పరిచయం అవుతుంది. నందిని రాంబాబును ప్రేమించినా అతను చనిపోతాను కదా అని నందినిని రిజెక్ట్ చేస్తాడు. అప్పుడు నందినికి సామ్రాట్ తో పెళ్లి ఫిక్స్ అవుతుంది. అప్పుడే సునీల్ కి బ్రెయిన్ ట్యూమర్ లేదనే అసలు నిజం తెలుస్తుంది. అప్పుడు నందిని ప్రేమని దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో తను కొట్టిన రౌడీలు రాంబాబుని చంపాలని అనుకుంటారు. అప్పుడు రాంబాబు ఆ రౌడీలను చాకచక్యంగా ఎలా అంత మొందించాడు? చివరికి నందినిని కలిసి తన ప్రేమని చెప్పి ఇద్దరూ ఒకటయ్యారా? లేదా అనేది మీరు వెండితెరపైనే చూడాలి...
సునీల్ గత సినిమాలలో పాటలు కూడాఇలానే ఉన్నాడు కానీ లుక్ విషయంలో మాత్రం ఈ సినిమాలో చూడటానికి కాస్త ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు. నందిని పాత్రలో ఎస్తర్ అభిమానులు మెప్పించడంలో తన ద్వితీయ ప్రయత్నంలో కూడా ఫెయిల్ అయ్యింది. సునీల్ రేంజ్ లో తన పాత్రకి ఫుల్ ఎనర్జీని తీసుకు రాలేకపోయింది. అతిధి పాత్రలో తనికెళ్ళ భరణి మెప్పించాడు. రఘుబాబు మరియు అతని గ్యాంగ్ మరియు పోసాని కృష్ణ మురళి చేసిన కామెడీ కొన్ని చోట్ల నవ్వించింది. లోకల్ విలన్ గా సుప్రీత్ బాగున్నాడు. మిగిలిన నటీనటులు వారి పాత్రల పరిధిమేర నటించారు.
ఈ సినిమా స్టొరీ లైన్ చాలా చిన్నది అండ్ సింపుల్ లైన్. భీమవరం కురాడు పది రోజుల్లో చనిపోతాడని తెలిసి హైదరాబాద్ వెళ్లి అక్కడ రౌడీలను ఎదిరించడం, అలాగే అతను చనిపోవడం లేదని తతెలిసిన తర్వాత వారి నుంచి తప్పించుకోవడం. ఇదే కాన్సెప్ట్ ని మనం షాదీ సే పెహలె(హిందీ మూవీ), ఆలీబాబా అరడజను దొంగలు(1994), అలాగే 1990 లో వచ్చిన ఇంగ్లీష్ మూవీ షార్ట్ టర్మ్ మూవీ నుంచి స్ఫూర్తి తీసుకొని చేసిన కథే ఇది.
భీమవరం బుల్లోడు హాయ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో, యావరేజ్ గా అనిపించే పాటలతో , అందమైన లోకేషన్స్ లో తీసిన సినిమా. హిట్ కోసం అలేగ్జాందర్ లా దండయాత్ర చేస్తున్న ఉదయ శంకర్ ఈ సారి కూడా పరాజయాన్నే మూటకట్టుకున్నాడు. కథ విషయంలో కాకపోయినా పాత్రలను తీర్చి దిద్దుకునేతప్పుడు అన్నా ఎంతవరకు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని ఆలోచించలేదు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అటు బాలేదు అని, ఇటు సూపరు అని చెప్పలేం కానీ ఓకే. బ్యాక్ గ్రౌండ్ ముసోక్ బాగుంది. ప్రేమలో పడనురా సాంగ్ చూడటానికి బాగుంది, లాగే సూపర్ మానులా సాంగ్ కూడా ఓకే అనిపించింది. కొన్ని చోట్ల ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ తన కట్టేరకి పదును పెట్టి సోది సీన్స్ ని లేపేసి ఉంటె బాగుండేది. సంతోష్ రాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఫైట్స్ బాగా లాంగ్ అవ్వడం వల్ల చూడటానికి చిరాకు వేస్తుంది.
సునీల్ ఒక కమెడియన్ గా బాగా పేరు తెచ్చుకుని తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకున్న తర్వాత హీరో గా ప్రమోట్ అయ్యాడు . రాజమౌళి దయవల్ల మర్యాదరామన్న లాంటి పెద్ద హిట్ ని కూడా తన ఖాతా లో వేసుకున్నాడు. తరువాత సిక్స్ ప్యాక్ హీరో కూడా అయ్యాడు. ఇవ్వన్నీ మాకు తెలియదా నువ్వు చెప్పాలా అని అడగొచ్చు కేవలం మీకు గుర్తుచేద్దాం అని అవి చెప్పాను. ఒక మంచి కమెడియన్ అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది ఇప్పటి తెలుగు సినిమాల్లో బ్రహ్మానందం , అలీ తరువాత అంత రెగ్యులర్ గా నవ్వించే వారు దగ్గిపోయారు అనే చెప్పాలి. సునీల్ లాంటి వాడు ఒకడు ఉంటె వారివురి మిద ఉన్న భారం అలాగే మొనాటని కూడా తగ్గుతుంది. హీరో గా అన్ని రసాలు పోషించి మెప్పించాలి అనే ప్రయత్నం మెచ్చుకోదగ్గదే కాని సునీల్ కామెడి లో ఉన్న ఈజ్ మిగతా వాటిల్లో చుపించలేకపోతున్నాడు. ఈ హీరో అవతారం చాలించి మళ్ళి కమెడియన్ గా అందర్నీ నవ్విస్తాడు నవ్వించాలి. మిగిలిన వారి గురించి పెద్ద గా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. చెప్పదగినంత పాత్రలు కూడా వారికి ఇవ్వలేదు.
దర్శకుడు ఉదయశంకర్ కలిసుందాం రా అనే చిత్రం తరువత మళ్ళి మూడు సినిమాలు తీసినా అలా తీయలేకపోతున్నాడు. ఈయన 'వన్ ఫిలిం వండర్' గానే మిగిలిపోతున్నాడు. రవితేజ, వెంకటేష్ లతో మళ్ళి హిట్ అందుకోవాలి అనే ఆయన ప్రయత్నాలు బెడిసి కొట్టగా ఇప్పుడు భీమవరం బుల్లోడు కూడా అయ్యన్ని గట్టేకించటం చాల కష్టం. ముందు గా ఆయన కలిసుందాం రా ఛాయల నుంచి బయటికి వచ్చి సరిగ్గా కధ ని బలం గా చిత్రికరించాగలరా అని అనుమానం రాక మానదు. ఇంతకన్నా ఈ చిత్రం గురించి చెప్పాలి అంటే నవ్విస్తున్నాం అనుకుని చాల నస పెట్టారు. సునీల్ కోసమైనా ఒక సారి చూడండి అని చెప్పలేకపోతున్నం. మళ్ళి హీరో గా సునీల్ కి ఈ సినిమా ఒక పెద్ద ఎదురుదెబ్బ.
Sunil,Esther,Uday Shankar,D Suresh Babu.భీమవరం బుల్లోడు - తుస్సుమన్న బుల్లోడు.!