-
Allu Aravind
-
amala paul anaka
-
anil music
-
Athidhi
-
Audience
-
CBI
-
chandra mohan
-
Cinema
-
court
-
Director
-
Episode
-
Hero
-
jeevan
-
Kathanam
-
Kumaar
-
lord siva
-
Love
-
Nani
-
Nijam
-
REVIEW
-
Sambandam
-
Samudra Kani
-
Samudrakhani
-
Samuthirakani
-
shashank
-
Shiva
-
Success
-
sukumar
-
Tamil
-
tanikella bharani
-
television
-
Telugu
-
vennela kishore
స్టొరీ లైన్ , ఇంటర్వల్ ఎపిసోడ్ , నాని పెర్ఫార్మన్స్స్టొరీ లైన్ , ఇంటర్వల్ ఎపిసోడ్ , నాని పెర్ఫార్మన్స్ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా మొదలవ్వడం , నో ఎంటర్టైన్మెంట్ , సాగదీసిన కథనం , రన్ టైం , ఎడిటింగ్ , మయ ఖన్నన్ పాత్రలో పెర్ఫార్మన్స్ బాగున్నా పాత్ర కనెక్ట్ కాకపోవడం ,సాంగ్స్ 'శిలవు నువ్వే .. శిల్పివి నువ్వే .. ప్రపంచాన్ని మార్చాలి అనుకోకు, ముందు నువ్వు మారు ప్రపంచం తానంతట అదే మారుతుందని చెప్పడమే ఈ సినిమా కథ. ఇక కథలోకి వెళితే.. అరవింద్(నాని) చదువుకునే స్తోమత లేనివాడు, అందుకే అరవింద్ తల్లి తనని చిన్నప్పుడే నాజర్ ఉన్న గురుకులంలో వదిలేస్తుంది. అక్కడ అరవింద్ కి నాజర్ ఎప్పుడూ నిజాయితీగా బతకాలని, అన్ని రూల్స్ ప్రకారమే చేయాలని, ఎంతో క్రమశిక్షణతో మెలగాలని చెబుతాడు. చదువు పూర్తి చేసుకొని ఇదే భావాలతో సొసైటీలోకి వచ్చిన అరవింద్ కి బయట ప్రపంచంలోని మనుషులతో కలవలేకపోతాడు. దాంతో అరవింద్ పలు ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటాడు. ఎలాగైనా ఈ చెడిపోయిన వ్యవస్థను మార్చాలి అనుకున్న అరవింద్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక మిషన్ రన్ చేసి ఒక ఎం.పి మరియు 147 మంది ప్రభుత్వ ఉద్యోగుల అక్రమాలను, వారి లంచాల బాగోతాన్ని బయటపెడతాడు. కానీ ఆ విషయం కోర్టుకి వెళ్లి, కోర్టులో న్యాయం జరగడానికి పట్టే కాల వ్యవధిలో పట్టు బడిన లంచగొండుల నుండి అరవింద్ కి సమస్యలు వస్తాయి. అదే సమయంలో తమిళనాడులో చూడటానికి అచ్చం అరవింద్ లా ఉండే మయఖన్నన్(నాని) రంగంలోకి దిగుతాడు. అరవింద్ ని అంతం చేయడానికి ఆ లంచగొండి ఉద్యోగులు ఏం చేసారు.? అసలు సామాన్యుడైన అరవింద్ అంతమంది నిజ స్వరూపాలను ఎలా బయట పెట్టగాలిగాడు.? అతనికి ఎవరెవరు సాయం చేసారు.? అసలు ఈ మయ ఖన్నన్ ఎవరు.? అతనికి అరవింద్ కి ఉన్న సంబంధం ఏమిటి.? అన్న ప్రశ్నలకి సమాధానం దొరకాలంటే మీరు సినిమా చూడాల్సిందే..నాని ద్విపాత్రాభినయం చేసిన మొదటి సినిమా ఇది.. అరవింద్ పాత్ర మొదట అమాయకంగా ఉండి, చివరికి వచ్చేసరికల్లా తను అనుకున్నది చేయడం కోసం ఎంతకైనా తెగించే స్థాయికి మారుతుంది. ఈ ట్రాన్స్ఫర్ మేషన్ ని నాని బాగా చూపించాడు. సెకండ్ రోల్ మయ ఖన్నన్.. కాస్త నెగటివ్ టచ్ ఉన్న ఈ రోల్ లో నాని చాలా బాగా చేసాడు. ముఖ్యంగా నెగటివ్ ఎక్స్ ప్రెషన్స్ చాలా బాగా పలికించాడు. ఓవరాల్ గా నాని ఈ సినిమాని చాలా వరకు తన పెర్ఫార్మన్స్ తో కాపాడాడు. అమలా పాల్ పాత్ర కథకి పెద్దగా సహాయపడని పాత్ర. హీరోకి ఒక జోడీగా, పక్కింటి అమ్మాయిలా కనిపించి వెళ్ళిపోతుంది. ఇక సెకండాఫ్ లో వచ్చే రాగిణి ద్వివేది కూడా కేవలం రెండు మూడు సీన్స్ లో కనిపించి మాయమైపోతుంది. ఆ పాత్ర వల్ల కూడా కథకి ఉపయోగం లేదు. సీనియర్ హీరో శరత్ కుమార్ ఫస్ట్ హాఫ్ లో సిబిఐ ఆఫీసర్ గా అతిధి పాత్రలో కనిపించి తన వర్క్ పర్ఫెక్ట్ గా చేసి వెళ్ళిపోయాడు. చెప్పాలంటే సెకండాఫ్ లో ఈ పాత్రని చాలా బాగా వాడుకోవచ్చు కానీ జస్ట్ ఫస్ట్ హాఫ్ కే పరిమితం చేసి తప్పు చేసాడు. వెన్నెల కిషోర్ సినిమా మొదట్లో కాసేపు నవ్వించడానికి ట్రై చేసాడు, కానీ సరిగా వర్క్ అవుట్ అవ్వలేదు. తనికెళ్ళ భరణి ఒకటి రెండు సీన్స్ లో నవ్వించాడు. జర్నలిస్ట్, టీవీ న్యూస్ ప్రజెంటర్ పాత్రలో శివ బాలాజీ చాలా బాగా చేసాడు. సినిమాలో చాలా సీన్స్ కి ఇతని పెర్ఫార్మన్స్ హెల్ప్ అయ్యింది. ఇక మిగిలిన సుబ్బు, అనిల్ మురళి నాజర్, చంద్ర మోహన్ తదితరులు వారి వారి పాత్రలకి న్యాయం చేసారు.జెండాపై కపిరాజు.. దాదాపు ఒకటిన్నర సంవత్సరంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి నానా కష్టాలు పడింది.. తీరా వచ్చాక చూసి చెబుతున్న మాట ఏమిటంటే కంటెంట్ గుడ్, టేకింగ్ బాడ్.. సముద్రఖని ఈ కథ ద్వారా చెప్పాలనుకున్న సోషల్ మెసేజ్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి. కానీ దానిని మరింత కమర్షియల్ గా చెప్పాలి అని, కూసింత కామెడీ, లవ్ ట్రాక్స్, మరో డ్యూయల్ రోల్ ని పెట్టి చెడగొట్టేస్తాడు. చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లో అరవింద్ పాత్రని డెవలప్ చెయ్యడానికి 40 నిమిషాలు అవసరం లేదు, కేవలం 10 - 15 నిమిషాల్లో అసలు పాయింట్ లోకి తీసుకెళ్ళిపోవచ్చు కానీ అలా చెప్పకుండా సాగదీసి వదిలాడు. సరే అదేమన్నా ఇంటరెస్టింగ్ గా చెప్పాడా అంటే అదీ లేదు. ఇంటర్వెల్ ముందు కథని కాస్త వేగవంతం చేసినా, ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ దారి తప్పించేసాడు, స్లో చేసేసాడు. సినిమాకి చివరి అంకంలో మయ ఖన్నన్ పాత్ర ఎంట్రీ ఇవ్వడం ఆ పాత్ర చుట్టూ మళ్ళీ కథని తిప్పడం ఆడియన్స్ కి ఇంకా బోరింగ్ గా అనిపిస్తుంది. సో కథనం చాలా మైనస్ అయ్యింది. ఇంటర్వెల్ బ్లాక్ మొదలైన తర్వాత కథ మొత్తం చెప్పేస్తాడు, ఆ తర్వాత చెప్పాల్సింది ఏమీ లేదు. దాంతో అక్కడి నుంచి కథను అటు ఇటూ సాగదీస్తూ వచ్చాడు. సినిమాకి హైలైట్ అవ్వాల్సిన క్లైమాక్స్ ని కూడా చెడగోట్టేసాడు. కోర్టు సీన్ లో సినిమా మొదట్లో చెప్పాలనుకున్న పాయింట్ ని సరిగా చెప్పలేకపోయాడు. అలాగే క్లైమాక్స్ ఫైట్ కూడా అర్థాంతరంగా ముగిసినట్టు ఉంటుంది. ఇక లాజికల్ గా చూసుకుంటే మయ ఖన్నన్ చివర్లో ఎందుకు మారాడు, దాని వెనకున్న బలమైన కారణం ఏంటనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే డైరెక్టర్ చెప్పలేదు. నాని ఫస్ట్ హాఫ్ లో కోర్టుకు వెళ్తాడు. అక్కడ నిజం చెప్తే, ఆ తప్పులో ఇన్వాల్వ్ అయిన పోలీసులని, మిగత అవారిని ఏమీ అనకుండా డైరెక్ట్ గా నానిని జైల్లో వేస్తాడు. అందులో లాజిక్ ఏమీ ఉండదు. ఇక డైరెక్టర్ గా సముద్ర ఖని అనుకున్న పాయింట్ ని చెప్పగలిగాడు కానీ పూర్తి స్థాయిలో పాత్రలని ఆడియన్స్ కి కనెక్ట్ చేస్తూ, ఆసక్తిగా చెప్పలేకపోయాడు. దానికి ముఖ్య కారణం అరవింద్ పాత్రలోని ఎమోషన్ ని మొదటి నుంచి కంటిన్యూగా ఆడియన్స్ కి కనెక్ట్ చేయకపోవడం. ఇక సుకుమార్ - జీవన్ ల సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. జివి ప్రకాష్ కుమార్ సాంగ్స్ పెద్దగా ఎవ్వరికీ కనెక్ట్ అవ్వలేదు. వాటిని పక్కన పెడితే రీ రికార్డింగ్ కూడా కొన్ని పార్ట్ లో మాత్రమే బాగుంది, మిగతా అంతా ఏదో తూతూ మంత్రంగా కానిచ్చేసాడు. ఫాజిల్ ఎడిటింగ్ కూడా బాలేదు. శశాంక్ వెన్నెలకంటి డైలాగ్స్ ఓకే. రజిత్ పార్ధసారధి, శ్రీనివాసన్ ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే, వీళ్ళు ఈ సినిమాలో వాడిన కొన్ని సిజి షాట్స్ ని ఇంకాస్త బెటర్ గా ప్లాన్ చేయాల్సింది. దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు ఇదిగో అదిగో అని ఊరించిన నాని డ్యూయల్ రోల్ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమా నానికి నటుడిగా గుర్తింపును తెచ్చిందే తప్ప కమర్షియల్ గా మాత్రం మరో పరాజయన్నే ఇచ్చింది అని చెప్పాలి. తెలుగు, తమిళ వెర్షన్స్ ని ఒకేసారి షూట్ చేసారు. కానీ తమిళ వెర్షన్ ఫ్లాప్ అయ్యాక, తెలుగు వెర్షన్ లో మార్పులు చేర్పులు, ఎడిటింగ్ లో పలు పార్ట్స్ లేపేసినా ఈ సినిమా ఇప్పటికీ పెద్దదిగా అనిపించింది. అందుకే ఈ సినిమా ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ కాలేదు. కంటెంట్ ప్రస్తుతం బర్నింగ్ పాయింట్ అయినప్పటికీ డైరెక్టర్ సముద్రఖని ఆడియన్స్ కి స్ట్రాంగ్ గా చెప్పలేకపోయాడు. దాంతో ఈ సినిమా రిజల్ట్ నానిని మరోసారి నిరాశపరిచింది. నానిలోని కొత్త యాంగిల్ చూడాలనుకునే వారు ఈ సినిమాని ఓ సారి చూడవచ్చు. మేము కూడా ఈ సినిమాలో చెప్పిన సోషల్ మెసేజ్ కోసం ఓ .25 రేటింగ్ ని ఎక్కువగా ఇచ్చాం. Nani,Amala Paul,Ragini Dwivedi,Samuthirakani,K. S. Sreenivasan.పంచ్ లైన్ : జెండాపై కపిరాజు - ఈ కపిరాజు కూడా నానికి సక్సెస్ ఇవ్వలేకపోయాడు.