ప్రమాదవశాత్తు కాలిపోయిన ఇంట్లోకి కార్తీక్ మరియు శ్రావణి ప్రవేశిస్తారు కొత్తగా పెళ్ళయిన వీళ్ళిద్దరూ అక్కడ నివశిస్తు ఉంటారు కాని గతంల్లో ఆ ఇంట్లో చనిపోయిన ఇద్దరు దయ్యలుగా మారి ఆ ఇంట్లోనే తిరుగుతూ వీరిద్దరిని విసిగిస్తూ ఉంటారు. అప్పటి నుండి కార్తిక్ అసలు ఈ దయ్యాల గతం ఏంటో కనుక్కోవాలనే ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఇది ఇలా నడుస్తుండగా ఆ దయ్యాలు కార్తీక్ మరియు శ్రావణి ల శరీరాలను కైవసం చేసుకొని ఐదేళ్ళ క్రితం వారికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటారు అసలు వాళ్ళ గతాలు ఏంటి ? ప్రభాకరన్ మరియు సెనోరిటా ఎవరు ? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే...
ఈ చిత్రం మీద ఆసక్తి కలిగించే విషయాల్లో మొదటిది కైనాజ్ , గతంలో రాగిణి ఎం ఎం ఎస్ చిత్రం లో కనిపించిన ఈ నటి, చిత్రం మొదటి నుండి చివరి దాకా ఆకట్టుకుంది అంతే కాకుండా ఈమె పాత్ర చాలా విచిత్రంగా ఉన్నా కూడా కథనంలో పట్టులేకపోయినా కూడా తన పాత్రకు న్యాయం చెయ్యగలిగింది. శివాజీ ఉన్నంతలో చాలా బాగా నటించి మెప్పించారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాచ రవి, పోసాని కృష్ణ మురళి, మరియు జబర్దస్త్ టీం వారి పాత్రలకి తగ్గ నటన కనబరిచారు. అవినాష్ మరియు భక్తి వారి బాగా నటించారు...
"ది హౌస్ వేర్ ఈవిల్ డ్వేల్స్" అనే ఇంగ్లీష్ చిత్రం నుండి ప్రేరేపితమయిన చిత్రం ఇది , కత్తాపరంగా ఈ చిత్రం చాలా బలహీనమయ్యింది బొత్తిగా ఎక్క్కడ కూడా ఆసక్తికరంగా అనిపించదు ఇక థ్రిల్లింగ్ అంశాలు అయితే అసలే లేవు , రేవన్ యాదు దర్శకత్వం కూడా గొప్పగా లేదు. సినిమాటోగ్రఫీ అందించిన విజయ్ మిశ్ర మెప్పించారు. చిత్రం మొదట్లో సినిమాటోగ్రాఫర్ పనితనం చాలా బాగుంది . సంగీతం అందించిన రాజ్ భాస్కర్ ఆకట్టుకోలేకపోయాడు కాని పరవాలేదనిపించాడు. కొన్ని సన్నివేశాల వరకు ఈ సంగీత దర్శకుడు అందించిన నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. ఎడిటర్ ప్రవీణ్ పూడి రెండవ అర్ధ భాగం మీద ఇంకాస్త కటువుగా వ్యవహరించి సన్నివేశాలను కత్తిరించి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
హారర్ చిత్రంలో హారర్ అంశాలు లేకపోతే ఆ చిత్రాన్ని ఏమని పిలవాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది గతంలో ఇటువంటి పరిస్థితి చాలాసార్లు ఎదుర్కున్న కూడా ఈరోజు మళ్ళీ ఎదురుకోవలసి వచ్చింది. భయపెడుతుంది అనుకుంటే బాధపెట్టే చిత్రం ఇది, త్రిల్ చేస్తుంది అనే ఆలోచనను కిల్ చేసే చిత్రం ఇది.. హారర్ చిత్రాలను ఇష్టపడేవారు హారర్ కాని ఈ హారర్ చిత్రాన్ని ఎలా ఎంజాయ్ చెయ్యగలరు. థ్రిల్లింగ్ అంశాలను ఊహించే వాళ్ళు థ్రిల్ అవ్వలేమని తెలిసాక ఎలా చూడగలరు ఈ చిత్రాన్ని.. ఈ చిత్రం ప్రేక్షకుడికి "హోర్రిబుల్" ఫీలింగ్ ని మిగులుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని చూడాలా వద్దా అన్నది మీ ఇష్టం....
Shivaji,Kainaz Motivala,Rewon Yadu,Prasad Reddy,Sekhar Chandra.బూచమ్మ బూచాడు - "హోర్రిబుల్" హారర్ చిత్రం