దుర్గ (అంజలి పాటిల్) అమలాపురంలో చదువుకుని పడవ తరగతిలో రాష్ట్ర స్థాయిలో ఎనిమిదవ ర్యాంకు సాదిస్తుంది. తదుపరి చదువులను హైదరాబాద్ లో కొనసాగించాలని అనుకుంటుంది కాని దానికి ఆమె తండ్రి శ్రీనివాస్ (సిద్దిక్) ససేమిరా ఒప్పుకోడు. కాని అతనికి తెలియకుండా దుర్గ సిటీ లో ని కాలేజీ లో అప్లై చేస్తుంది.
ఇదిలా సాగుతుండగా ఆమెకి విజయ్ (రత్న శేఖర్ రెడ్డి) పరిచయం అవుతాడు అతని పద్దతలు నచ్చడంతో దుర్గ కి అతని మీద ఆసక్తి కలుగుతుంది. వీరిద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకుంటారు కాని హైదరాబాద్ కి రాగానే దుర్గని కొంతమంది అపహరించి వ్యభిచార గృహం లో ఉంచుతారు అక్కడ పదిరోజులు ఆమెను మానభంగం చేస్తారు. ఆమె తండ్రి గురించిన నిజం వారికి తెలిసాక ఆమెను మరింత హింసించడం మొదలు పెడతారు.. అసలు వారికి తెలిసిన నిజం ఏంటి? శ్రీనివాస్ దుర్గను కాపాడటానికి ఎం చేసాడు? దుర్గ ఎలా బయటపడింది? అన్నదే మిగిలిన కథ ...
అంజలి పాటిల్ పాత్ర చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది చాలావరకు ఈ పాత్రకు న్యాయం చేసింది కొన్ని సన్నివేశాలలో అద్భుతం అనిపించింది. ముఖ్యంగా వ్యభిచార గృహం లో వచ్చే సన్నివేశాలలో ఆమె నటన ఈ పాత్రకు సరిగ్గా సరిపోయింది. రత్న శేఖర్ రెడ్డి పాత్ర చాలా చిన్నది అయిన ముఖ్యమయినది ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. సిద్దిక్ కొన్ని సన్నివేశాలలో అద్భుతంగా నటించినా ఎమోషనల్ సన్నివేశాల వద్ద పరవాలేదు అనిపించారు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు అయిన దుర్గ అతని తండ్రి శ్రీనివాస్ పాత్రలకు అంజలి పాటిల్ మరియు సిద్దిక్ సరిగ్గా సరిపోయారు.. మిగిలిన అందరు నటీనటులు అలా వచ్చి వెళ్ళిపోయిన వారే...
ఈ చిత్ర కథ కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించారు , నిజంగా ఒక అమ్మాయి నుండి విన్న కథ ద్వారా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు దర్శకుడు రాజేష్ చెప్పారు. కాబట్టి కథాపరంగా ఇందులో లోపాలను వెతికే పనిలేదు కాని నిజంగా జరిగిన సంఘటనలకు కాస్త డ్రామా జతపరిచి చిత్రాన్ని తెర మీదకు తీసుకొచ్చిన విధానం గురించి దర్శకుడిని మెచ్చుకొని తీరాలి .. కథనం విషయం వచ్చేసరికి ఈ చిత్రం అటు ప్రేక్షకులను త్రిల్ చెయ్యదు ఇటు బోల్డ్ గాను సాగదు.. ఒకనూక సమయంలో ప్రేక్షకుడు చిత్రం మీద ఆసక్తి కోల్పోతాడు.. రామ తులసి సినిమాటోగ్రఫీ బాగుంది రాజముండ్రి దగ్గర కొన్ని ప్రదేశాలను చాలా బాగా చూపించారు.. శరత్ అందించిన పాటలు ఆకట్టుకోలేదు, శాంతను మొయిత్ర అందించిన నేపధ్య సంగీతం బాగుంది.. ఎడిటింగ్ బొత్తిగా బాగోలేదు చిత్రం చాలాసేపు సాగినట్టు అనిపిస్తుంది.. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు దారుణంగా సాగుతాయి.. సన్ టచ్ ప్రొడక్షన్స్ వారి నిర్మాణ విలువలు పరవలేధనిపించాయి..
ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డు లానే కాకుండా జాతీయ అవార్డు ను కూడా గెలుచుకుంది. సందేశానికి వినోదాన్ని జతపరిచారు కాని చిత్రాన్ని సాగాదీస్తున్నాం అన్న విషయాన్నీ మరిచిపోయారు దర్శకుడు కాని వారి బడ్జెట్ లో ఇలాంటి చిత్రాన్ని చెయ్యడం ఇప్పుడు ఉన్న ట్రెండ్ కి వ్యతిరేకంగా చిత్రాన్ని చెయ్యడం అందులోనూ కథ విషయంలో రాజీ పడకపోవడం వంటి వాటిని తప్పక మెచ్చుకోవాలి. ఇలాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ గొప్పగా ఉండదు గతంలోనే చాలా చిత్రాలు ఈ విషయాన్నీ నిరూపించాయి. కాని ఊహజనితమయిన ఆనందానికి అలవాటు పడ్డ జనానికి కఠినం అయిన నిజం కష్టమే ఒకవేళ మీరు ఇలాంటి చిత్రాలను ఇష్టాదేవారయితే వెంటనే దగ్గరలోని థియేటర్ లకి వెళ్లి చిత్రాన్ని చూడండి...
Siddique,Anjali Patil,Rajesh Touchriver,Sunitha Krishnan,Sharreth.నా బంగారు తల్లి : ఒక కూతురి యథార్థ గాథ