
-
Abhimanyu Mithun
-
Athidhi
-
Audience
-
Ayodhya
-
chakri
-
chandra mohan
-
Cinema
-
Comedy
-
Director
-
Episode
-
Hero
-
Heroine
-
Hyderabad
-
Kathanam
-
Kesari
-
Kesari1
-
Kurradu
-
local language
-
Love
-
Lucknow
-
manchu manoj kumar
-
Nara Brahmani
-
prakash reddy
-
REVIEW
-
Sambandam
-
seetha
-
sudigali sudheer
-
swathi
-
Swati
-
Telugu
-
Thopudurthy Prakash Reddy
-
Thriller
నిఖిల్ - స్వాతి జంటగా వచ్చిన 'స్వామి రారా' సినిమాకి సీక్వెల్ అంటూ 'మోసగాళ్ళకు మోసగాడు' సినిమాని ప్రమోట్ చేసారు కానీ ఈ సినిమాకి ఆ సినిమాకి సంబంధం లేదు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. మోసగాళ్ళకు మోసగాడు అనే క్రైమ్ సినిమా అయోధ్యలోని బాగా ఫేమస్ అయిన రామాలయంలోని రాముడు - సీత విగ్రహాల చోరీతో మొదలవుతుంది. ఈ విగ్రహాలు చాలా పవిత్రమైనవి మరియు చాలా ఖరీదైనవి. ఇక్కడ నుంచి కట్ చేస్తే ఎలాంటి వారినైనా మోసం చేసి దొంగతనం చేయగల టాలెంట్ ఉన్న కుర్రాడు క్రిష్(సుధీర్ బాబు). హైదరాబాద్ లో నివసించే క్రిష్ హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో లైబ్రేరియన్ గా పనిచేసే అమాయకమైన బ్రాహ్మణి అమ్మాయి జానకి(నందిని రాయ్) ని చూసి ప్రేమలో పడతాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఆ విగ్రహాల చోరీ పాయింట్ తో కథ అయోధ్య - లక్నో - హైదరాబాద్ ప్రాంతాల చుట్టూ ఫస్ట్ హాఫ్ తిరుగుతూ ఉంటుంది. అదే టైంలో హైదరాబాద్ లోకల్ డాన్ అయిన గురు(జయప్రకాశ్ రెడ్డి) ఈ విగ్రహాల చోరీని క్రిష్ కి అప్పగిస్తాడు. కానీ క్రిష్ ఆ విగ్రహాలతో పారిపోవాలని నిర్మయించుకోవడంతో అసలు సమస్య మొదలవుతుంది. దాంతో ఇంటర్నేషనల్ స్మగ్లర్ రుద్ర(అభిమన్యు సింగ్) రంగంలోకి దిగుతాడు. అక్కడి నుంచి క్రిష్ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కున్నాడు.? చివరికి రాముడు - సీత విగ్రహాలు ఏమయ్యాయి? అన్నదే మీరు వెండితెరపై చూడాల్సిందే..
మెయిన్ లీడ్ రోల్స్ చేసిన వారి నుంచి మొదలు పెడతా.. ముందుగా హీరో సుధీర్ బాబు. ఇప్పటి వరకూ తనని తానూ స్టైలిష్ గా ప్రెజంట్ చేసుకునే చాన్స్ సుధీర్ బాబుకి రాలేదు, కానీ ఈ సినిమాలో ఆ అవకాశం రావడంతో దాన్ని ఉపయోగించుకున్నాడు. లుక్ పరంగా చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. ఇక పెర్ఫార్మన్స్ పరంగా కాస్త మెరుగు పడ్డాడు. చాలా కాన్ఫిడెంట్ గా కనిపించే దొంగగా మంచి హావ భావాలనే పలికించాడు. తెలుగమ్మాయి నందిని రాయ్ తన ప్రెట్టీ లుక్స్ మరియు అమాయకత్వపు పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా, అందరినీ తనవైపు ఆకర్షించుకుంది. సిన్సియర్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో పంకజ్ కేసరి పర్ఫెక్ట్ గా సరిపోవడమే కాకుండా సూపర్బ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అభిమన్యు సింగ్ డాన్ పాత్రలో బాగానే చేసాడు, కానీ స్క్రీన్ పల వలన ఎక్కువగా తనకు నటనను చూపే ఆస్కారం రాలేదు. అతిధి పాత్రలో కనిపించిన మంచు మనోజ్ గడ్డం లుక్ బాగుంది. అలాగే తన అతిధి పాత్ర సింపుల్ అండ్ స్వీట్. సప్తగిరి, ఫిష్ వెంకట్, జయ ప్రకాష్ రెడ్డి బాగా నవ్వించారు. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్ విషయం ఏమిటి అంటే దువ్వాసి మోహన్ ఎక్కువగా నవ్వించాడు. చంద్ర మోహన్ స్కూల్ టీచర్ గా పాత్రకి తగ్గ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు.
మనకు ఇప్పటి వరకూ విగ్రహాల చోరీల మీద పలు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి.. అలాంటి మరో సినిమాకి సుధీర్ బాబు సైన్ చేసాడు.. ఒక హీరోయిన్ ఉంది.. ఇన్వెస్టిగేషన్ కోసం ఓ టఫ్ లుకింగ్ యాక్టర్ ని ఎంచుకున్నారు.. డాన్ పాత్రలని సృష్టించారు.. మధ్య మధ్యలో కమెడియన్స్ తో కామెడీ చెయ్యడానికి ట్రై చేసారు... క్రైమ్ కామెడీ సినిమాలో ఇవి ఉంటాయి.. ఇందులోనూ అవే ఉన్నాయి. తను కొత్తగా చెప్పాలనుకున్న పాయింట్ ఏమీ లేదు.. హీరో వేరే ఏమన్నా చేస్తాడా అంటే లేదు ఎప్పటిలానే తనొక దొంగ. ఈ సినిమా కథ నుకున్నప్పుడు ఇది స్వామీ రారా సినిమాకి సీక్వెల్ కానీ సినిమా పూర్తయ్యాక మోసగాళ్ళకు మోసగాడు సీక్వెల్ లా అనిపించదు. సీక్వెల్ అంటే ఒరిజినల్ సినిమా థీమ్ లైన్ తో ఇంకాస్త ఆసక్తికరంగా, ఇంకాస్త హై లెవల్ లో ఉండాలి. కానీ ఈ సినిమాకి కెప్టెన్ గా వ్యవహరించిన డైరెక్టర్ నెల్లూరి బోసు సినిమాని అంత ఆసక్తికరంగా నడిపిన్చాలేకపోవాడు.. స్టార్టింగ్ బాగా చేసి వెంటనే సినిమాని బాగా డల్ చేసేసి.. మళ్ళీ క్లైమాక్స్ దగ్గర సినిమాని నడిపించాడు.. ఓవరాల్ గా మెప్పించదగిన అటెంప్ట్ ని బోస్ చెయ్యలేదు. ముఖ్యంగా ఒరిజినల్ వెర్షన్ లోని ఒక్క సీన్ కూడా మ్యాచ్ అయ్యేలా ఈ సినిమా లేకపోవడం బాధాకరం.