కథ :
యూరప్ లో పేరు మోసిన జ్యోతిషుడుగా ఉన్న విక్రమాదిత్య (ప్రభాస్) తన లైఫ్ లో లవ్ లైన్ లేదని అనుకుంటాడు. ఈ క్రమంలో తనతో పరిచయమైన వారితో ఫ్లటేషన్ షిప్ మాత్రమే చేస్తాడు. తన జీవితంలో ప్రేమ పెళ్లి లేవని చెబుతూ వచ్చే ఆదిత్య లైఫ్ లోకి ప్రేరణ వస్తుంది. ఆమెతో ప్రేమలో పడ్డ ఆదిత్య ఆమె గురించి ఓ నిజాన్ని తెలుసుకుంటాడు. లవ్ వర్సెస్ డెస్టినీ ఫైట్ లో ఎవరు గెలిచారు అన్నది సినిమా కథ.
విశ్లేషణ :
నీ జీవితం నీ చేతుల్లో కాదు నీ చేతల్లో ఉంటుంది. అదే ఈ సినిమా గురించి చెప్పే అసలైన పాయింట్. పేరు మోసిన జ్యోతిషుడు అతని లైఫ్ లోకి వచ్చిన అమ్మాయిని పొందలేనని తెలుసుకుని విధితో పోరాడే కథతో రాధేశ్యామ్ వచ్చింది. సినిమాకు ఖర్చు పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ మీద కనిపిస్తుంది. సినిమాలో ఎక్కువ శాతం కథ మొత్తం ప్రధాన పాత్రల మధ్య నడుస్తుంది.
హీరో, హీరోయిన్ల మధ్య సీన్స్ చాలా బాగున్నాయి. అయితే అంత బడ్జెట్.. అంత పెద్ద స్టార్ కాస్ట్ ని డైరక్టర్ సరిగా వాడుకోలేదని చెప్పొచ్చు. సినిమా అంతా జరుగుతుంది ఇంకా ఏదో ఉంటుంది అని ఆడియెన్స్ ఎదురుచూస్తుంటాడు. ఇంతలోనే సినిమా ముగుస్తుంది. ఫైనల్ గా సినిమా చూసిన ఆడియెన్ కి ఏదో మిస్ అయ్యింది అన్న భావన కలుగుతుంది.
విధిని ఎదురించి తమ ప్రేమని దక్కించుకోవాలని ఓ ఇద్దరు ప్రేమికులు చేసే సాహసం రాధేశ్యామ్ సినిమా కథ. అయితే డైరక్టర్ అనుభవ లోపమో లేక మరేదో కానీ సినిమాలో కొన్ని సన్నివేశాలు తప్ప ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో కొద్ది భాగం సాగదీసినట్టు అనిపిస్తాయి. హీరో, హీరోయిన్ల మధ్య కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.
సాంగ్స్ పిక్చరైజేషన్ తో పాటుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ చాలా బాగున్నాయి. అయితే రాధేశ్యామ్ అంటూ ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన ఆడియెన్స్ కి మాత్రం కొంత అసంతృప్తి మాత్రం దక్కకమానదు. అయితే ఓవరాల్ గా మాత్రం సినిమా యావరేజ్ మార్కులు కొట్టేసినట్టే అని చెప్పొచ్చు.
నటీనటుల ప్రతిభ :
ప్రభాస్ ఆదిత్య పాత్రలో అదరగొట్టాడు. ముఖ్యంగా తన లుక్స్ తో ఆకట్టుకున్నాడు. బాహుబలితో సూపర్ మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ ఇలా ఒక పక్కా లవ్ స్టోరీతో రావడం మాత్రం షాకింగ్ గా ఉంది. సినిమాలో ఒక్కటంటే ఒక్క ఫైట్ ఉండదు. అది నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి పెద్ద షాక్ ఇస్తుంది. పతాక సన్నివేశాల్లో ప్రభాస్ నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఇక ప్రేరణ పాత్రలో పూజా హెగ్దే కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. రాధేశ్యామ్ సినిమాలో పూజా స్పెసల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఆమె లుక్స్, ఆమె గ్లామర్ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. భాగ్యశ్రీ, జగపతి బాబు, కృష్ణం రాజు, సచిన్, జయరాజ్, మురళి శర్మ వీరి పాత్రలు జస్ట్ ఓకే అనిపిస్తాయి.
సాంకేతికవర్గం పనితీరు :
సినిమాకు మనోజ్ పరమ హం స సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాకు కెమెరా వర్క్ చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది. జస్టిన్ ప్రభాకరణ్ ఇచ్చిన సాంగ్స్ బాగున్నాయి. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయ్యింది. డైరక్టర్ రాధాకృష్ణ రాధేశ్యామ్ సినిమాని ఆశించిన స్థాయిలో తీయలేదని చెప్పొచ్చు. అయితే కొన్ని చోట్ల మాత్రం దర్శకుడు తన ప్రతిభ కనబరిచాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
ప్రభాస్, పూజా హెగ్దే
బ్యాక్ గ్రౌడ్ స్కోర్
విజువల్స్
మైనస్ పాయింట్స్ :
సాగదీసిన సన్నివేశాలు
ఆశించిన స్థాయిలో కథనం లేకపోవడం
బాటం లైన్ :
రాధేశ్యామ్.. ప్రేమ, విధి మధ్య యుద్ధం.. ఆశించిన స్థాయిలో సినిమా లేదు.
రేటింగ్ : 2.5/5