ఇప్పటికే చిత్ర షూటింగ్ పూర్తవగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను చకా చకా కంప్లీట్ చేస్తున్నారు చిత్రం యూనిట్ . సినిమా విడుదలకు సరిగా రెడున్నర నెలల సమయం ఉండటంతో చిత్ర యూనిట్ ఇప్పటి నుంచే ప్రమోషన్స్ ను ప్రారంభించింది.ఈ మేరకు విజయదశమి సందర్భంగా 'ఆదిపురుష్' ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ ను కూడా విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.
అప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉండటంతో వీఎఫ్ఎక్స్ లోపంతో 'ఆదిపురుష్ టీజర్' అంతగా ఆకట్టుకోలేకపోయింది. రాముడు, సీతమ్మ, రావణుడు, హన్మంతుడి పాత్రలను కూడా తప్పుగా చూపించారని విమర్శలు కూడా వ్యక్తం అయిన విషయం తెలిసిందే. ఈ వివాదం ఢిల్లీ హైకోర్టు వరకూ వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో కోర్టు నుంచి ప్రభాస్‌కు , మరియు చిత్ర యూనిట్ కు నోటీసులు కూడా అందాయి అంట మరి . అయితే ఇప్పుడిప్పుడే ఈ సమస్య సద్దుమణుగుతుండటంతో తాజాగా మేకర్స్ చేసిన పోస్ట్ ఒకటితో మళ్లీ 'ఆదిపురుష్'పై ట్రోల్స్ మొదలవుతున్నాయి.
గత 30 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ సెర్డ్చ్ టాపిక్ ఏంటని గూగుల్ లో వెతికితే 'ఆదిపురుష్'ను చూపిస్తోందని, మూవీ క్రేజ్ ఇంకా పెరుగుతోందని చిత్ర నిర్మాణ సంస్థ 'టీ సిరీస్' ట్వీటర్ ద్వారా ఒక పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్లు, ట్రోలర్స్ స్పందిస్తూ అది సినిమాకు ఉన్న క్రేజ్ తో సెర్చ్ చేయలేదంటున్నారు. డిఫరెంట్ కాజ్ లో సెర్చ్ చేశారని కామెంట్ల రూపంలో సంస్థకు బదులిస్తున్నారు అంట మరి . ఇప్పటికైనా సినిమాను సరి చేయాలని, అభిమానుల అంచాలను రీచ్ అయ్యేలా చూడాలని చిత్ర దర్శకుడు కి సూచించారు అభిమానులు
ఇన్ని విమర్శలు, వ్యతిరేకత తర్వాత దర్శకుడు ఓం రౌత్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తోంది. ఎక్కువగా వ్యతిరేకత వచ్చిన సీన్లను, వీఎఫ్ ఎక్స్ పైనా దిద్దుబాటు చర్యలు చేపట్టారని మనకు సమాచారం. , రాజేష్ మోహనన్ నిర్మిస్తున్నారు. 2023 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు షెడ్యూల్ చేశారు అని టాక్.