సామజవరగమన లాంటి చిన్న సినిమాతో గతేడాది బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో శ్రీ విష్ణు. తాజాగా శ్రీ విష్ణు మరోసారి సూపర్ కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఇక అదే ఓం భీమ్ బుష్. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఇదొక హార్రర్ కామెడీ సినిమా.దెయ్యం సినిమాలు చూస్తున్నపుడు లాజిక్కుల జోలికి అస్సలు పోకూడదు. అలాంటిది నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్ అని ఈ సినిమా దర్శకుడే చెప్పాక అస్సలు లాజిక్స్ గురించి ఆలోచించకూడదు. జస్ట్ సినిమా చూసి ఎంజాయ్ చేయాలంతే.. ఓం భీమ్ బుష్ అలాంటి సినిమానే. ఆ సీన్ ఎందుకు వచ్చింది.. ఈ సీన్ ఎందుకు వచ్చింది.. అని లాజిక్స్ తీయకుండా చూస్తే కడుపులు చెక్కలయ్యేలా నవ్వుకోవచ్చు.సినిమాలో అక్కడక్కడా A సర్టిఫికేట్ జోకులు పడినా అంత ఎబ్బెట్టుగా అనిపించవు.ఫస్టాఫ్ లో కొన్ని సీక్వెన్సులు బాగా పేలాయి. ఇక సెకండాఫ్ మొదటి 45 నిమిషాలు హిలేరియస్ గా ఉంటుంది. ప్రియదర్శి, దెయ్యం సీన్స్ అయితే కడుపులు చెక్కలయ్యేలా నవ్వు తెప్పిస్తాయి. రాహుల్ రామకృష్ణ, దెయ్యం సీన్స్ కూడా బాగా నవ్విస్తాయి. క్లైమాక్స్ మెయిన్ ట్విస్ట్ రివీల్ అయ్యే దాకా నాన్ స్టాప్ కామెడీ అనేది ఉంది.


ఇక చివర్లో మాత్రం ఎమోషనల్ ముగింపు ఇచ్చాడు దర్శకుడు.. అక్కడ కాస్త స్లో అవుతుంది కానీ అప్పటికే ఫుల్ కామెడీ ఉంటుంది. అయితే చివర్లో చెప్పిన కథ మాత్రం కొంచెం కొత్తగా అనిపిస్తుంది.ఎప్పుడు రొటీన్ దయ్యం కథలు చూసిన వాళ్లకు ఈ సినిమా రీ ఫ్రెషింగ్ అనిపిస్తుంది.శ్రీ విష్ణు మరోసారి తనదైన కామెడీతో మెప్పించాడు. తన డైలాగ్ డెలివరీ సినిమాకు చాలా ప్లస్ అయింది. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ రోల్స్ బాగున్నాయి.రచ్చ రవి సీన్స్ బాగా అలరిస్తాయి. హీరోయిన్స్ ప్రీతి ముకుందన్‌, అయేషా ఖాన్‌ ఏదో ఉండాలి కాబట్టి ఉన్నారు. శ్రీకాంత్ అయ్యంగార్ కనిపించేది రెండు సీన్స్ అయినా కూడా చాలా బాగా నవ్వించాడు. మిగిలిన నటులందరూ తమ పాత్రలకు బాగానే న్యాయం చేశారు. హారర్ కామెడీ సినిమాలకు మ్యూజిక్ చాలా కీలకం. ఈ సినిమాకు సన్నీ ఎంఆర్ తన వంతు న్యాయం అయితే చేశాడు. పాటలు ఓకే.. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. విజయ్ వర్ధన్ కావూరి ఎడిటింగ్ బాగుంది. ఎక్కడా బోర్ రాకుండా కట్ చేసాడు. సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది. ఈ సినిమా దర్శకుడు హర్ష రొటీన్ దెయ్యం కథ తీసుకున్నా.. చివర్లో ట్విస్ట్ ఇంట్రెస్టింగ్..గా పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: