విభిన్న భాషల్లోని ఓటీటీ వేదికలు ఎలా ఉన్నా తెలుగు భాషలో మాత్రం ఆహా ఓటీటీ మాత్రం ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ముఖ్యంగా సినిమాల పరంగా వినూత్నమైన కథ, కథనాలనకు విశేషమైన ఆదరణ పొందడానికి ఆహా అందించిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. పాన్ ఇండియా స్థాయిలో మాత్రమే కాదు. గ్లోబల్ వేదికపై ఆదరణ పొందిన థ్రిల్లర్, సస్పెన్స్, పారా నార్మల్, థ్రిల్లర్స్, సైకలాజికల్, సైంటిఫిక్, సోసియో ఫాంటసీ వంటి విభిన్న జానర్ల సినిమాలు తెలుగులో చూడగలుగుతున్నాం.


వైవిద్యంమైన కథనాలతో, వినూత్నమైన సినిమాటిక్ విలువలతో నిర్మితమైన సినిమాలను తెలుగు ప్రూక్షకులకు అందించడంలో ఆహా ముందుంది. ప్రాంతీయ నేపథ్యం సినిమాల పరంగా మలయాళీ సినిమాల్లో మంచి వైవిధ్యం ఉంటుంది. సునిశితమైన కథనాలే కావొచ్చు. సహజత్వాన్ని ప్రదర్శించడమే కావొచ్చు.  మళయాళీ సినిమాల్లో ఆ అర్హత ఉంటుందనేది విధితమే. ఈ ప్లేవర్ తెలుగు ప్రజలకు అందించడంలో ఆహా ముందుంది.


ఈ ప్రయత్నంలోనే భాగంగా చాప్రా మర్డర్ కేస్, అయ్యప్పన్ కోషియన్, ఆహా, డెరిక్ అబ్రహం, భార్గవి నిలయం వంటి మలయాళ సినిమాలను ఆహా వేదికగా నిలచింది. వినూత్నంగా వస్తున్న టాలీవుడ్ సినిమాలను కూడా ప్రోత్సహించడంలో ఆహా విశేషంగా కృషి చేస్తోంది. ఈ  మధ్య విశేష ఆదరణ పొందిన మారుతూ నగర్ సుబ్రహ్మణ్యం, 35 వంటి సినిమాలే దీనికి నిదర్శనం. ఈ మధ్య కాలంలో ఐఎమ్ డీబీ అత్యధిక రేటింగ్ ఇచ్చినా సింబా సినిమా కూడా ఆహాలో స్ర్టీమ్ అవుతుంది. చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ ఉంటే చాలు మేము ప్రోత్సహిస్తాం ఇస్తామంటున్నారు ఆహా యాజమాన్యం. ఈ విధానానికి శ్రీకారం చుట్టింది.. నాంది పలికింది ఆహా ఓటీటీ ప్లాట్ ఫారమే.


తెలుగులో కొత్త దనంతో తెరకెక్కిన కలర్ ఫొటో వంటి సినిమాలకు ఆహా వేదికగా అవకాశమిచ్చి కొత్త ఆలోచనలకు ప్రోత్సహాన్ని అందించింది. కలర్ ఫొటో సినిమాకు జాతీయ అవార్డును అందుకొని సినిమాపై తనకున్న వైవిధ్యాన్ని నిరూపించుకున్నారు హీరో సుహాస్. అంతే కాదు ఇలాంటి ఆసక్తికర కథలే తన సినీ ప్రయాణంగా సుహాస్ గుర్తింపు తెచ్చుకున్నారు. అదే కోవలో ప్రసన్న వదనం, గొర్రె పురాణం వంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలతో సుహాస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా జాగ్రత్తగా సరికొత్త కథలను ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైతున్న యువతరం నటుల్లో సుహాస్ ది ప్రత్యేక శైలి. సుహాస్ తదుపరి గొర్రె పురాణం కూడా ఆహా ఓటీటీ వేదికలో విడుదల కానుండటం విశేషం.


సినిమాలపై సుహాస్ కున్న ముందు చూపు గొర్రె పురాణంలోని వైవిధ్యాన్ని గుర్తించిన ఆహా వేదిక స్వతాహాగా ఈ సినిమాను స్వీకరించి ప్రసారం చేస్తోంది. ఇలాంటి యువతరం సినీ ప్రేమికులకు ఒక పుష్పక విమానంలా ఆహా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ తరహా సినిమాలకు బాగా ఇష్టపడుతున్న టాలీవుడ్ ప్రేక్షకుల గొర్రె పురాణం సినిమాను ఆస్వాదిస్తున్నారు.


ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం కళ, కళాత్మకత, సినిమాపై అమిత పైన ప్రేమతో ఇష్టంతో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామంటే.. ఆహా వంటి వేదికలు మాకు వారధులుగా నిలుస్తూ.. ప్రోత్సాహాన్ని అందించడం  ప్రధాన కారణమని సుహాస్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: