టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తాజాగా నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.ఈ సినిమా ప్రమోషన్స్ లో సినిమా హీరో హీరోయిన్ల కంటే ఎక్కువగా అల్లు అరవింద్ కనిపిస్తున్నారని కామెంట్స్ ముందు నుంచి వినిపిస్తున్నాయి.ఇదిలావుండగా మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. గేమ్ చేంజర్' మీద చేసిన కామెంట్స్ వేడి చల్లారక ముందు మరో కాంట్రవర్సీకి అల్లు అరవింద్ కారణం అయ్యారు. 'తండేల్' విడుదల సందర్భంగా తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ 'మగధీర' గురించి అల్లు అరవింద్ మాట్లాడారు. తన మేనల్లుడు హీరోగా పరిచయమైన 'చిరుత' ఏవరేజ్ హిట్ అవ్వగా ఎలాగైనా భారీ హిట్ ఇవ్వాలని, నష్టాలకు సిద్ధపడి తాను ''మగధీర' ప్రొడ్యూస్ చేశానని, రాజమౌళిని దర్శకుడిగా తీసుకున్నానని చెప్పుకొచ్చారు.

చిరుత ఏవరేజ్ అనడం పట్ల మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు టాలీవుడ్ మీడియా, ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఎందుకంటే 'చిరుత' టోటల్ షేర్ వేల్యూ 25 కోట్లకు ఎక్కువే. ఆ ఏడాది 2007లో విడుదలైన సినిమాల్లో హయ్యస్ట్ గ్రాసర్ ఆ సినిమాయే. అంతే కాదు ఆ ఏడాది ఆఖరికి టాలీవుడ్ హయ్యస్ట్ గ్రాస్ సాధించిన సినిమాల్లో ఎనిమిదో స్థానంలో నిలిచింది. చాలా సెంటర్లలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. దాన్ని అల్లు అరవింద్ ఏవరేజ్ అని ఎలా అంటారని విస్మయం వ్యక్తం చేశారు. 'చిరుత' కంటే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు సినిమాల ఫస్ట్ డెబ్యూ మూవీ కలెక్షన్స్ తక్కువ అని టాలీవుడ్ ట్రేడ్ టాక్.ఇక ఈ సమావేశంలో ఆయన్ని ఒక ప్రముఖ రిపోర్టర్ ప్రశ్న అడుగుతూ ‘మొన్న ఒక ఈవెంట్ లో మీరు కాస్త నోరు తూలినట్టు ఉన్నారు. సోషల్ మీడియాలో దానిపై పెద్ద రచ్చ జరుగుతుంది. మీపై ట్రోలింగ్స్ కూడా జరుగుతున్నాయి..వాటిని మీరు గమనించారా?’ అని అడగ్గా, దానికి అల్లు అరవింద్ సమాధానం చెప్తూ ‘హా గమనించాను’ అని అంటాడు. ‘మరి మీరు ఆ వ్యాఖ్యలు కావాలని ఉద్దేశించి మాట్లాడినవా?, లేకపోతే యాదృచ్చికంగా మాట్లాడిందా’ అని అడగ్గా, దానికి అల్లు అరవింద్ సమాధానం చెప్తూ ‘నో కామెంట్స్’ అని అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: