కాంట్రవర్సీ స్టార్ గా ఇండస్ట్రీలో కొద్దిరోజుల్లోనే పేరు తెచ్చుకున్నారు యంగ్ హీరో విశ్వక్ సేన్.ఈయన ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమాకు ముందు ఏదో ఒక కాంట్రవర్సీ ఉంటుంది... అయితే కావాలనే కాంట్రవర్సీలు సృష్టిస్తారో లేక అనుకోకుండా అలా జరిగిపోతాయో తెలియదు. కానీ విశ్వక్ సేన్ ప్రతి సినిమాకు ఏదో ఒక కాంట్రవర్సీ అయితే జరుగుతుంది. ఇక లైలా మూవీ విడుదలవ్వక ముందు పృథ్వి ఈవెంట్ కి వచ్చి వైసిపి పై పరోక్షంగా సెటైర్లు వేయడంతో ఇది కాస్త రచ్చకు దారి తీసింది. అయితే ఈ విషయంలో విశ్వక్ సేన్  కల్పించుకొని క్షమాపణలు చెప్పినప్పటికీ వైసిపి వాళ్ల కోపం ఇంకా చల్లారలేదు. సోషల్ మీడియాలో లైలా మూవీని బ్యాన్ చేస్తున్నట్టు పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే..ఎన్నో అంచనాలతో విశ్వక్ సేన్  నటించిన లైలా మూవీ తాజాగా ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజు విడుదలైంది. 

అయితే ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ షోస్ చూసిన జనాలు ట్విట్టర్ ద్వారా సినిమా గురించి స్పందిస్తున్నారు. మరి విశ్వక్ సేన్స్ హిట్టు కొట్టారా.. కాంట్రవర్సీ స్టార్ ఖాతాలో హిట్టు పడిందా అనేది ఇప్పుడు చూద్దాం.. విశ్వక్ సేన్ హీరోగా చేసిన లైలా మూవీ లో ఆయన లేడి గెటప్ లో కూడా నటించారు. విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో ఎంత అందంగా ఉన్నారో చెప్పనక్కర్లేదు. అయితే అలాంటి విశ్వక్ సేన్ నటించిన లైలా  మూవీ తాజాగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కొంతమందేమో ఈ సినిమాను చూసి సినిమా బోరింగ్ టైం వేస్ట్ మనీ వేస్ట్ అందరూ ఊహించినట్టే కథ ఉంది అని రివ్యూ ఇస్తే మరికొంత మందేమో పర్వాలేదు ఓవరాల్ గా కథ బాగుంది ఒకసారి సినిమాని చూడొచ్చు అని రివ్యూ ఇస్తున్నారు.

ఇక మరి కొంతమందేమో ఫస్టాఫ్ అద్భుతంగా ఉంది అని కామెంట్లు పెడుతున్నారు. స్టోరీ అంత బాగోలేదని కానీ విశ్వక్ సేన్ మాత్రం సినిమా కోసం చాలా కష్టపడ్డారని,విశ్వక్ సేన్ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయినా రావాలని కొంతమంది రివ్యూ ఇస్తున్నారు. అలాగే విశ్వక్ సేన్ వన్ మ్యాన్ షో అంటూ సినిమా కోసం ప్రాణం పెట్టాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అలా కొంతమంది పాజిటివ్ గా మరి కొంతమంది నెగటివ్ గా కామెంట్లు పెట్టడంతో ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. మరి చూడాలి మరికొద్ది గంటల్లో సినిమా ఫుల్ రిజల్ట్ ఎలా ఉండబోతుంది.. ఫుల్ రివ్యూ ఎలా ఇస్తారు అనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: