త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘జిగేల్’. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి మల్లి యేలూరి దర్శకత్వం వహించారు. నిర్మాతల్లో ఒకరైన నాగార్జున అల్లం  స్టోరీ, స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రాన్ని డాక్టర్ వై.జగన్ మోహన్, నాగార్జున అల్లం సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, పృథ్వీ రాజ్, మధునందన్, ముక్కు అవినాశ్, మేక రామకృష్ణ, నళిని, జయ వాణి, అశోక్, గడ్డం నవీన్, చందన, రమేష్ నీల్, అబ్బా టీవీ డా. హరిప్రసాద్ తదితరులు నటించారు. టీజర్, ట్రైలర్లతో ఆడియన్స్ లో మంచి బజ్ ను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ప్రీమియర్ ను ఇటీవలే ప్రదర్శించారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం పదండి.

స్టోరీ: నందు(త్రిగుణ్) ఓ లాకర్ టెక్నీషియన్. జీవితంలో సెటిల్ అయిపోవాలని లాకర్లను దొంగతనంగా తీస్తూ ఉంటాడు. అతనికి కలలో మీనా(మేఘా చౌదరి) అనే అమ్మాయి కలలోకి వస్తూ వుంటుంది. కలలో ఆమెతో రొమాన్స్ చేసినట్టు ఊహాలోకంలో విహరిస్తూ వుంటాడు. అదే అమ్మాయి అతనికి తారసపపడుతుంది. ఆ అమ్మాయి కూడా చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నట్టు నందుకు తెలిసిపోతుంది. అప్పటి నుంచి ఇక ఇద్దరూ కలిసి దొంగతనాలు చేయడం ప్రారంభిస్తారు. ఈ క్రమంలో రాజా చంద్ర వర్మ ప్యాలెస్ లో వుండే ఎప్పటి నుంచో ఓ పురాతన లాకర్ తెరుచుకోవడం లేదని మీనాకి తెలుస్తుంది. దాంతో ఆమె జేపీ(సాయాజీ షిండే) దగ్గర పి.ఎ.గా చేరి... ఆ లాకర్ ను తన ప్రియుడైన నందుతో ఓపెన్ చేయించాలని శత విధాలా ప్రయత్నిస్తూ వుంటుంది. మరి ఆ లాకర్ ను  చివరకు తెరిచారా? ఆ లాకర్ లో ఏ ముంది? ఆ లాకర్ ఎవరిది? రాజా చంద్ర వర్మ ప్యాలెస్ ఎవరిది? దానికి హీరోయిన్ మీనాకి ఉన్న సంబంధం ఏమిటి? అసలు జేపీ ఎవరు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్స్ కి కాస్త రొమాంటిక్ కూడా తోడైతే... అలాంటి సినిమాలు యూత్ ను బాగా ఆకట్టుకుంటాయి. ఇలాంటి సినిమాను గ్రిప్పింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో తెరకెక్కిస్తే ఆడియన్స్ ను థియేటర్లో రెండు గంటల పాటు కదలనివ్వకుండా కూర్చోబెట్టవచ్చు. మంచి ఎంగేజింగ్ ప్లాట్ తో ఇలాంటి సినిమాలను తీస్తే... బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ఖాయం. తాజాగా దర్శకుడు మల్లి యేలూరి... నిర్మాతల్లో ఒకరైన నాగార్జున అల్లం అందించిన  స్టోరీ, స్క్రీన్ ప్లేను ప్రేక్షకులు హాయిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వగలిగే సినిమాను వెండితెరపై ఆవిష్కరించారు. యూత్ ను ఆకట్టుకునే రొమాంటిక్ సన్నివేశాలతో పాటు... కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కామెడీ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ఎంగేజ్ అయ్యేలా చేశారు.
ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ కామెడీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అలాగే పోసాని వేసిన ఆండ్రాయిడ్ బాబా వేషం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటాయి. పోసానికి రాసిన సంభాషణలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే లాయర్ మన్మథరావు పాత్రలో పృథ్వీ రాజ్ చేత చేయించిన కామెడీ బాగా వర్కవుట్ అయింది. ఇక సెకెండాఫ్ లో అసలు కథ మొదలై... చివరి వరకూ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో లాకర్ చుట్టూ రాసుకున్న స్టోరీ, స్ర్కీన్ ప్లే ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
త్రిగుణ్ ఎప్పటిలాగే తన ఎనర్జిటిక్ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. లాకర్ టెక్నీషియన్ గా బాగా సూట్ అయ్యాడు. అందులో లాకర్ ను ఓపెన్ చేసే టెక్నిక్స్ ను కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీశారు. ఆ పాత్రలో త్రిగుణ్ బాగా ఒదిగిపోయి నటించారు. అతనికి జంటగా నటించిన మేఘా చౌదరి కూడా రొమాంటిక్, యాక్షన్ సన్నివేశాల్లో బాగా నటించింది. కథ మొత్తం సెకెండాఫ్ లో ఆమె చుట్టూనే తిరుగుతుంది కాబట్టి... ఆమె పాత్ర ఇంపార్టెన్స్ బాగా ఆకట్టుకుంటుంది. పోసాని పాత్ర బాగా నవ్విస్తుంది. ఫస్ట్ హాఫ్ లోనూ, సెకెండాఫ్ లోనూ అతని పాత్ర ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. సాయాజీ షిండే పాత్ర నెగిటివ్ రోల్ లో పర్వాలేదు అనిపిస్తుంది. మన్మథరావు పాత్రలో పృథ్వీ రాజ్ ఎప్పటిలాగే బాగా నటించారు. అతనితో పాటు నటించిన జయవాణి పాత్ర కూడా బాగుంది. హీరోయిన్ తల్లి పాత్రలో నళిని నటించి ఆకట్టుకుంది. రఘుబాబు ముక్కు అవినాష్, మధునందన్ పాత్రలు పర్వాలేదు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

నిర్మాత నాగార్జున అల్లం  రాసిన స్టోరీ, స్క్రీన్ ప్లేను దర్శకుడు మల్లి యేలూరి ఆడియన్స్ ను రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునేలా తీయడంలో సక్సెస్ అయ్యారు. రొమాంటిక్ సన్నివేశాలు, యాక్షన్ సీన్స్, సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్  అన్నీ పక్కాగా తెరపై చూపించి ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడంలో విజయం సాధించారు డైరెక్టర్. అతనికి సహాయంగా నిర్మాతలు కూడా ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను మంచి స్టార్ కాస్ట్ తో ఎంతో క్వాలిటీగా నిర్మించారు. సీనియర్ నటీనటులతో ఇందులో ముఖ్యమైన పాత్రలను పోషించేలా నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు. వాసు అందించిన సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. విజువల్స్ అన్నీ బాగున్నాయి. చివర్లో వచ్చే ఐటెం సాంగ్ పిక్చరైజేషన్ కూడా ఆకట్టుకుంటుంది. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఈ చిత్రానికి ఎడిటర్. దాంతో సినిమా ల్యాగ్ లేకుండా చాలా గ్రిప్పింగ్ గా, క్రిస్పీగా వుంది. రమేశ్ చెప్పాల, నాగార్జున అల్లం రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. సంగీత దర్శకుడు ఆనంద్ మంత్ర అందించిన బాణీలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టకుంటాయి. ఓవరాల్ గా సినిమా ఆడియన్స్ ను రొమాంటిక్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది. గో అండ్ వాచ్ ఇట్.


మరింత సమాచారం తెలుసుకోండి: