
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ హీరో తనదైన నటనతో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు మొదట ఎన్టీఆర్ తన సినిమాలు ద్వారా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ వరుసగా సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.
రీసెంట్ గా ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తన తదుపరి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా..... ఎన్టీఆర్ ప్రముఖ వ్యాపారవేత్త నార్నే శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతిని 2011 మే 6వ తేదీన వివాహం చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. ఈ జంట అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహాన్ని జరుపుకున్నారు.
వివాహం తర్వాత లక్ష్మీ ప్రణతి, ఎన్టీఆర్ వారి వైవాహిక జీవితం చాలా సంతోషంగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కుమారులు ఉన్నారు. లక్ష్మీ ప్రణతి స్వయాన చంద్రబాబు మేనకోడలి కుమార్తె అని సమాచారం. ఎన్టీఆర్ పెళ్లి సమయంలో లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ కి భారీగానే ఆస్తులు తీసుకొచ్చినట్లుగా ఇండస్ట్రీవర్గాలో జోరుగా ప్రచారాలు సాగాయి. అప్పట్లోనే హైదరాబాద్ శివారు ప్రాంతంలో దాదాపు 205 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తిని లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ కు కట్నంగా తీసుకొని వచ్చారట. ప్రస్తుతం ఈ ఆస్తి విలువ దాదాపు రూ. 1200 కోట్లకు పైనే ఉన్నట్టుగా తెలుస్తోంది.
అంతే కాకుండా ఎన్నో నగలు, ఆభరణాలు, కార్లు, భవనాలు లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ కి కట్నం కింద తీసుకోవచ్చారట. ఎంతో ఆస్తి ఉన్నప్పటికీ లక్ష్మీ ప్రణతి చాలా సింపుల్ గా ఉంటారు. లక్ష్మీ ప్రణతి అచ్చ తెలుగు అమ్మాయిల సాంప్రదాయంగా ఉంటూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ జోడీలలో లక్ష్మీ ప్రణతి, ఎన్టీఆర్ ఒకరిగా నిలవడం విశేషం.