అచ్చ తెలుగు అబ్బాయి..అందులోనూ హైదరాబాద్ లో పుట్టిపెరిగిన యువకుడు తర్వాత తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోల లీస్ట్ లో చేరిపోయారు. అజిత్ నటించిన ‘ప్రేమలేఖ’ తెలుగులో అద్భుతమైన విజయం సాధించింది. తన నట జీవితాన్ని తెలుగు చిత్రమైన‘ ప్రేమ పుస్తకం ’ తో ప్రారంభించాడు. ప్రముఖ నటి షాలిని ని 2000 లో పెళ్ళి చేసుకున్నాడు. ఇతడు చదువుకున్నది పదవ తరగతి వరకు ఐనా బహుభాషాకోవిదుడు.

తెలుగు, తమిళం,కన్నడ,మళయాలం,ఆంగ్ల భాషలను అనర్గళముగా మాట్లాడగలడు. అంతే కాదు అతడు దేశంలోనే అత్యుత్తమ డ్రైవర్లలో ఒకడు. 2004లో బ్రిటిష్ ఫార్ములా  సీజన్ లో ఫార్ములా 2 రేసింగ్ డ్రైవర్ గా పాల్గొన్నాడు. దేశంలో అత్యుత్తమ డ్రైవర్లలో మూడో స్థానం పొందాడు. అజింత్ రేసింగులో పాల్గొనాలనే ముందు బైకు మెకానిక్ గా జీవితం ఆరంభించాడు. ఒకసారి ప్రమాదం జరగడంతో, తర్వాత పలు వ్యాపార ఏజెన్సీలు ఆయనను మోడలింగ్ చేయాల్సిందిగా కోరాయి. అటునుంచి 1992లో ప్రేమపుస్తకం అనే తెలుగు సినిమాలో నటించాడు. అప్పటినుంచి ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 

ప్రేమలేఖ 


అజిత్, దేవయాని నటించిన ప్రేమలేఖ చిత్రం అద్బుతమైన విజయం సాధించింది. ఇద్దరు ఒకరినొకరు చూసుకోకుండా కేవలం  ప్రేమలేఖలతో పరిచయం చేసుకొని చివరిదాకా ఉత్కంఠంగా సాగే ఈ చిత్రం అప్పట్లో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఘన విజయం సాధించింది.


తిరుపతి 


అజిత్, సదా నటించిన తిరుపతి చిత్రం ఫుల్ మాస్ ఎంట్రటైనర్ గా నలిచింది. ఈ చిత్రంల అజిత్ యాక్షన్ సీన్లు చూస్తుంటే థియేటర్లో ప్రేక్షకలు మంత్ర ముగ్ధులు అయ్యారట. ఈ చిత్రం తెలుగులో పెద్దగా నడవకపోయినా తమిళంలో మాత్రం సూపర్ హిట్ అయ్యింది.


ప్రేమ పుస్తకం :

తెలుగులో అజిత్ మొదటి చిత్రం.. ఈ చిత్ర దర్శకుడు గొల్లపూడి శ్రీనివాస్, గొల్లపూడి మారుతీరావు కుమారుడు. అయితే గొల్లపూడి శ్రీనివాస్ షూటింగ్ తీస్తున్న సమయంలో ఓ ప్రమాదంలో మరణించాడు. దీంతో కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది. కానీ ఈ చిత్రాన్ని పూర్తి చేశారు.అంతే కాదు ఈ చిత్రంలో నటించినందుకు అజిత్ కి అవార్డు కూడా వచ్చింది. 


వాలి :


అజిత్ కెరీర్ లో మరో అద్భుతమైన చిత్రం వాలి. ఇందులో డబల్ రోల్ చేశాడు..హీరోగా, విలన్ గా రెండు విభిన్నమైన పాత్రలో నటించాడు. జ్యోతిక, సిమ్రాన్ లు హీరోయిన్లుగా నటించారు. 


సిటిజన్ :

ఈ చిత్రం కూడా తెలుగు,తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అన్యాయాలపై ఎదురు తిరిగే ఓ యువకుడి పాత్రలో అజిత్ అద్భుతంగా నటించాడు.


ఆశ..ఆశ..ఆశ..

అజిత్, సువలక్ష్మి, ప్రకాశ్ రాజ్ నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళంలో మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ విలన్ గా అతన్ని ఎదిరించే యువకుడిగా అజిత్ సూపర్ గా నటించాడు. 


బిల్లా :

అజిత్ చాలా స్టైలిష్ గా కనిపించిన చిత్రం బిల్లా ఈ చిత్రం గతంలో డాన్ సినిమా ప్రేరణతో తీసిన చిత్రం. 


ఆరంభం : 

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన చిత్రం ఆరంభం. ఈ చిత్రంలో రానా కూడా నటించాడు.


వేదలం :

వేదలం తమిళంలో గత సంవత్సరం రిలీజ్ అయ్యింది. మాస్ రౌడీ మంచివాడిగా మారి విలన్లపై రివేంజ్ తీర్చుకునే చిత్రంగా అజిత్ తన విశ్వరూపాన్ని చూపించాడు. 


ఎంత వాడు కాని :


అజిత్ కెరీర్ లో మరో అద్భుతమైన చిత్రం ఎంత వాడు కానీ. ఓ పోలీస్ ఆఫీసర్ గా కిడ్నాపింగ్ ముఠాల ఆటకట్టించే పాత్రలో సూపర్ గా నటించారు. ఈ చిత్రంలో అజిత్ సరసన అనుష్క నటించింది.





మరింత సమాచారం తెలుసుకోండి: