ఒకప్పుడు తమిళ,కర్ణాటక రాష్ట్రాలను గజ గజలాడించిన గందపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అంటే తెలియని వారు ఉండరు. ఒక్క గందపు చెక్కలే కాదు..ఎనుగు దంతాలు కూడా స్మగ్లింగ్ చేస్తూ అడవిలోకి వచ్చిన ఏ పోలీస్ ని వదలకుండా చంపేశాడు. రెండు రాష్ట్రాలో అటవీ ప్రాంతం మొత్తం తన హస్తగతం చేసుకున్న వీరప్పన్ పోలీసులకు సవాల్ విసిరేవాడు. ఎన్ని శవాలు తిన్న రాబందైనా ఒక్క గాలివాటుకు ఎగిరిపోతుందని ఎన్నో దారుణాలు చేసిన వీరప్పన్ చివరికి ఓ పోలీస్ అధికారి పన్నిన వ్యూహంలో చిక్కుకొని ప్రాణాలు వదిలారు. ఇక తెలుగు,హిందీ ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ ఆ మద్య ‘కిల్లింగ్ వీరప్పన్’ చిత్రంతో తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేసి మంచి విజయం సాధించారు.
తాజాగా వీరప్పన్ బయోగ్రఫీ పై బాలీవుడ్ లో ‘వీరప్పన్ ’ చిత్రాన్ని తీస్తున్నారు. ఈ చిత్రం ప్రధాన పాత్రలో సచినో జోషి నటిస్తున్నారు. వీరప్పన్ ముఠా సభ్యులు, అనుచరులు, మద్దతుదారులు, సానుభూతిపరులు, అతడిని పట్టుకోవడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆపరేషన్ టీమ్ మెంబర్స్.. ఇలా ఎంతోమంది నుంచి ఎన్నో వివరాలని సేకరించి మరీ ఈ సినిమాని తెరకెక్కించాడట వర్మ. ఈ సందర్భంలో వర్మ కు ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలిసిందట.
వీరప్పన్ పోస్టర్
గతంలో కన్నడ సూపర్ స్టార్ రాజ్‌కుమార్‌ని కిడ్నాప్ చేసినట్టుగానే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ని సైతం కిడ్నాప్ చేసేందుకు అప్పట్లో వీరప్పన్ యత్నించాడట. అయితే తన చిత్రానికి ఇది మంచి హైలెట్ గా ఉంటుందని ఓ సన్నివేశంలో భాగంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. వీరప్పన్ గురించి ప్రస్తవిస్తూ..వీరప్పన్ స్టోరీ వింటే నమ్మశక్యంగా అనిపించదు. అతడిని పట్టుకునేందుకు జరిగిన ప్రయత్నాలు అంతకన్నా నమ్మశక్యం అంటున్నాడు వర్మ.
వర్మ ట్విట్ :