మహాభారతకథలో అనేక చిన్నకథలు కూడా ఇమిడిఉన్నాయి. నవయుగవైతాళికులు నాగిరెడ్డి, చక్రపాణి, కెవి రెడ్డి, పింగళి నాగేంద్ర రావు తలపుల కలబోతలో జన్మించిన ఈ కథలో పంచపాండవులు అసలే కనిపించరు. పాండవులు లేని మహాభరతకథ ఊహకందదు కదా! కాని వీళ్ళు మనకి పంచ పాండవులను గుర్తేచేయలేదు. 27.03.1957 న విడుదలైన ఈ సినిమాకు మార్కస్ బార్ట్-లె కెమెరా పనితనం నాటి ప్రేక్షకు లకు సమ్మోహనాస్త్రమే. "నాటి మార్కస్ బార్ట్-లే ఫొటొగ్రఫి ముందు నేటి బాహుబలి గ్రాఫిక్స్ వీకే" నాడు వెలుగు నీడలు తెలుపు నలుపులో సృష్ఠించిన ఆ మహనీయు ల నైపుణ్యం ముందు నెడెంత గానో అభివృద్ది చెందిన సాంకేతిక నైపుణ్యం కూడా దిగదుడుపే.
సంగీతం: ఘంటసాల, సాలూరి కలసి చరిత్రగతినే మార్చారు. సుమధుర
గానం: ఘంటసాల, మాధవపెద్ది, సుసీల, లీల, వసంత, లీల, జిక్కి.
చిత్రలేఖనం: మాధవపెద్ది, గోఖలే, గోపాల్, కళాధర్.
నృత్యాలు: సరోజ్ ఖాన్, లలితా రావు, రీటా.
శిల్పం: దృశ్య రూపమంతా అద్భుత శిల్ప సదృశమే. సినిమా అంతా సభాభవనాలు, విశాలమైన ప్రాంగణాలతో, శిల్ప సోయగాలతో నింపేశారు బార్ట్-లే.
184 నిమిషాలు నడిచే నిడివి అయినా ఏమాత్రము మానసికోల్లాసం తగ్గించని మహాద్భుత దృశ్తకావ్యమిది.
సుమ పరిమళ శోభితాన్ని మనచెవుల్లో సంగీతం తో నిపేశారు. ఒక్కో పాట మన మనో వాటికల్ని అనంత విశ్వంలో విహరింపచేస్టాయి. లలిత కళలు ఐదూ ఈ సినిమాలోనే కలసిపోయి ఒక మనొహర స్వప్నాన్ని జీవితాంతం గుర్తుంచుకునేలా రూపొందించారు. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, నాట్యం, శిల్పాల కలబోత ఒక మనోహర సాదృశ సౌందర్యాన్ని సర్వత్రా వ్యాపింపచేశాయి.
లాహిరి...లాహిరి గీతం లోని దృశ్య చిత్రీకరణ అనితర సాధ్యం. నేటి టెలివిజన్ ను నాడే ప్రియదర్శిని రూపములో మనకళ్ళ ముందు విందు చేసిన చూపించిన కేవి రెడ్డి దార్శనికతకి జోహార్లు. వివాహ భోజనంబు గీతం పిల్లలనే కాదు పెద్దలనూ పిల్లల్ని చేస్తుంది. నేటి గ్రాఫిక్సు కు నాడే శ్రీకారం చుట్టారు బార్ట్-లే. భాతదేశపు టాప్ ఫైవ్ సినిమాల్లో మొదటి-ద్వితీయ స్థానాల్లో నిలిచాయి మాయాబజార్, మొగల్-ఏ-ఆజం సినిమాలు. ఇవి రాబట్టిన వసూళ్ళ లెక్కలు వేల కోట్ల రూపాయలకు చేరాయి. ఘటోట్ఖచ - అభిమన్యు యుద్ద సన్నివేశాలు హృద్యమం. సాంకేతిక విశ్వరూపం.
కొత్త పదాలు ఎలా భాష లోకి వస్తాయో, ఘటోత్ఖచుడు చిన్నమయ్యకు విశదీకరిచే ఘట్టం మనకు భాషా, సాహిత్యం, సాంప్ర దాయం పై ఎనలేని ప్రేమను చిగురింపచేస్తాయి. ఈ సినిమా ఒక సాంప్రదాయ భాండాగారం. జాతిని, నీతిని, విధానాలని నిబిడీకరించిన ఒక మహా స్వరూపం. ఈ తరం పిల్లలకు ఆతరం జీవన విధానం దృశ్య, శ్రావ్య, మనోరంజకంగా చూపించే ఒక సాంస్కృతిక వారధి. తరాల అంతరాన్ని తగ్గించి పరిణామ క్రమాన్ని సుభోదాత్మకం చేస్తుంది. “దిస్ ఇస్ ది బెష్ట్ బెట్ ఫర్ గుడ్ సీయింగ్ & లెర్నింగ్”
ప్రియదర్శిని లో ప్రియుణ్ణి చూస్తూ...
అలరించే అంశం నాగిరెడ్డి చక్రపాణి ల స్నేహాన్ని చిరస్మరణీయం చేసి ఆ బందాన్ని పటుతరం చేసింది. దర్శకత్వానికే దర్శకత్వం నేర్పిన దిగ్ధరశక సార్వభౌముడు కదిరి వెంకట రెడ్డి ఉరఫ్ కెవి రెడ్డి తెలుగువారి ఆత్మ బందువుగా మారాడు ఈ సినిమాతో.
చివరి అంశం నటీనట వర్గం. సావిత్రి, సామర్ల వెంకట రంగారావు ఉరఫ్ ఎస్.వి.ఆర్ లు నువ్వా నేనా అన్నంత పోటీపడి చేసిన నటన హిమశిఖర సమోన్నతం. ఎవరు గొప్పో తేల్చటం ఆ విధాతకే సాధ్యం కాకపోవచ్చు. ఎన్.టి.ఆర్ శ్రీకృష్ణ పాత్రలో ఒదిగిపోయాడు, ఎదిగిపోయి విశ్వవిఖ్యత నట సార్వభౌమునిగా మారటానికి బీజాలు వేశారు చక్రపాణి, కె. వి. రెడ్డి. ఇక అక్కినేని ప్రేమికుని పాత్రలకు నాటినుండే నాయకుడయ్యాడు. ఎవరిని చూసినా ఏసన్నివేశం చూసినా మనోహరం, మూడుగంటల సినిమా కూడా ఏమాత్రం తనివితీరనివ్వని కళాత్మక దాహం తీరదు, తనివి తీరని ఒక మహా స్వప్నంగా గడచిపోతుంది.
ముగించటానికి ముందు పింగళి & కేవి రెడ్డి ల సాహిత్యం, కథ, కధనాలు, ఘంటసాల వెంకటేస్వర రావు, సాలూరి రాజేశ్వరరావుల సంగీతం కడు మనొహరమని మాత్రమే చెప్పగలను ఎందుకంటే దాన్ని వివరించటానికి నాకు భాష చేతగాదు. భావముతో తన్మయత్వం చెందిన మనసుకు మాటలు రావు.
ముఖ్య పాత్రలు శ్రీకృష్ణ (ఎన్.టి.ఆర్) బలరాముడు (గుమ్మడి), రెవతి (చాయాదేవి), సుభద్ర (ఋష్యేంద్రమణి), శశిరేఖ (సావిత్రి), అభిమన్యుడు (ఏ.ఎన్.ఆర్), ఘటొత్ఖచుడు (ఎస్.వి.ఆర్), శకుని (సి.ఎస్.ఆర్), లక్ష్మణ కుమారుడు (రేలంగి), రుక్మిణి (సంధ్య), చిన్నమయ్య (రమణారెడ్డి), సాత్యకి(నాగభూషనం), ధుర్యోధన (ముక్కామల), కర్ణ (మిక్కిలినేని) మొదలైనవారు.