సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు ప్రేమ వివాహాలు జరగడం చూస్తుంటాం..అయితే ఇందులో చాలా కాలం కలిసి జీవించిన జంటలు ఉంటే పెళ్లి చేసుకున్న కొంత కాలానికే అభిప్రాయ బేధాలు వచ్చి విడిపోయిన జంటలు చాలా చూశాం. ఇందులో విడిపోయన తర్వాత అస్సలు ముఖాలు చూసుకోని జంటలు ఉంటే అప్పుడప్పుడు కలుసుకునే జంటలు కూడా ఉన్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రాల్లో ఒకటి బద్రి. ఈ చిత్రంలో హీరోయిన్ గా అమిషా పాటేల్ తో పాటు మరో హీరోయిన రేణు దేశాయ్ కూడా నటించింది. ఆ సమయంలో పవన్, రేణూ ఇద్దరు ప్రేమలో పడ్డారు..అందే కాదు ఈ ఇద్దరు పెద్దలను ఒప్పంచి పెళ్లి కూడా చేసుకున్నారు.
కొంత కాలం తర్వాత అభిప్రాయ బేధాలు రావడంతో విడిపోయారు..అంతే కాదు చట్టపరంగా విడాకులు కూడా తీసుకున్నారు. కానీ ఈ ఇద్దరూ ఇప్పటికీ కలుస్తూనే ఉంటా..ఏదైనా పవన్ మీడియాతో ఇంటరాక్ట్ అయినప్పుడంతా ఏదో ఒక విషయంలో రేణుదేశాయ్ పేరును ప్రస్తావిస్తూనే ఉంటాడు. ఇక రేణుదేశాయ్ అయితే ట్విట్టర్ లో తరచుగా పవన్ నామస్మరణ చేస్తూ ఉండటం గమనిస్తూనే ఉన్నాం. దీన్నిబట్టి డైవర్స్ అయినప్పటికీ ఆ ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారనే విషయం అర్థమవుతోంది.
ఇక సెప్టెంబర్ 2న పవన్ కళ్యాన్ పుట్టిన రోజు కనుక ఫ్యాన్ భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటారు. కానీ ఇలాంటి వాటికి మాత్రం పవన్ చాలా దూరంగా ఉంటారు. సమయం చిక్కినప్పుడల్లా రేణు దేశాయ్ ఇంటికి వెళ్లి తన ఇద్దరు పిల్లలు అఖిరానందన్, ఆద్య. ఈ ఇద్దరంటే పవన్ కళ్యాన్ కి చాలా ఇష్టం..అందుకే పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా రేణు దేశాయ్ ఓ ఫోట్ ట్విట్ చేసింది... తాను 2010లో తీసిన ఓ ఫొటోని ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఫ్యాన్సంతా ఈ ఫొటోని కామన్ డీపీగా పెట్టేసుకోవచ్చని చెప్పేసింది.
ఆ ఫొటోని చాలామంది డీపీగా పెట్టేసుకోవడం ఇప్పటికే మొదలుపెట్టారు. ఆ ఫొటో గురించి ఇంకా రేణుదేశాయ్ చెబుతూ ``పవన్ గారి కళ్లల్లో ఇంటెన్సిటీని బయటికి చెబుతున్న ఈ ఫొటో అంటే నాకు చాలా ఇష్టం. 2010లో నేను కొన్ని నికాన్ డి5 కెమెరాతో క్లిక్ చేశా. స్కిన్ టోన్ కూడా సహజమైనదే. నేనేమీ మార్చింది కాదు`` అంటూ తన మాజీ భర్తని తెగ పొగిడేస్తూ ఉంది రేణు దేశాయ్.
రేణూ దేశాయ్ ట్విట్ :