తెలుగు తెర హాసిని త్వర‌లో త‌ల్లి కాబోతోందా? ప్ర‌స్తుతం గ‌ర్భ‌వ‌తా? బాలీవుడ్‌లో ఈ వార్త గ‌త కొన్ని రోజులుగా చ‌క్క‌ర్లు కొడుతోంది. అయితే దీనిపై తొలిసారి జెనీలియా స్పందించింది. ``ఆ వార్త‌ల్లో నిజం లేదు. నా మ‌న‌సు అప్పుడూ ఇప్పుడూ సినిమాల‌పైనే ఉంది. పెళ్ల‌యితే సినిమాల‌కు దూరం అవ్వాల‌ని లేదు క‌దా? త్వ‌ర‌లోనే న‌టిస్తా. దీనికి రితీష్ కూడా ఒప్పుకొన్నాడు`` అని జెనీలియా చెప్పుకొచ్చింది. అయితే పాత్ర‌ల ఎంపిక‌లో మ‌రింత ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తుంద‌ట‌. ``రొమాంటిక్ పాత్ర‌లు చేయ‌లేను. కాస్త రిజ‌ర్వ్‌గా ఉండాలి క‌దా? ఆ రొమాన్స్ రితీష్‌తో అయితే బెంగ పెట్టుకోవ‌ల‌సిన అవ‌స‌రం లేదు..`` అని చిలిపిగా న‌వ్వేస్తోంది హాసిని.

మరింత సమాచారం తెలుసుకోండి: