బాలీవుడ్ లో ‘క్యాలెండర్ గర్ల్స్ ’ చిత్రానికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. నిజజీవితంలో మోడల్స్ పడుతున్న బాధలను ఈ చిత్రంలో ఆవిష్కరించారు. అయితే ఈ సినిమాలో నటించిన బ్యూటీలకు మాత్రం పెద్దగా పేరు రాలేదు. ఈ మద్య బాలీవుడ్ లో చాలా మంది మొదట మోడలింగ్ చేస్తూ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో హాట్ బ్యూటీ రుహి సింగ్ ‘క్యాలెండ్ గర్ల్స్’ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో అందాలు ఎంతగా ఆరబోయాలో అంతగా ఆరబోసింది..కానీ పెద్దగా వర్క్ ఔట్ కాలేదు. దీంతో ఉత్తరాదిన అంతగా లక్కు దొరకలేదు కనీసం దక్షిణాదినైనా అదృష్టం కలిసి వస్తుందేమో తమిళంలో వస్తున్న ‘బొంగు’ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.
ఇక సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నారంటే హాట్ హాట్ గా ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హల్ చేస్తున్న విషయం తెలిసందే. తాజాగా టూ పీస్ బికినీ వేసి రచ్చ రచ్చ చేస్తోంది . స్వమ్మింగ్ పూల్ దగ్గర టూ పీస్ బికినీ లో సేద తీరుతోంది రుహి సింగ్. రకరకాల ఫోజుల్లో ఫోటోలకు ఫోజిచ్చిన ఈ హాట్ భామ వాటిని తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసి మరింతగా రెచ్చగొడుతోంది .
సెక్సీ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న ఈ భామ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారు కి నిద్ర లేకుండా చేస్తోంది. ఏది ఏమైనా ఈ మద్య బాలీవుడ్ నుంచి వస్తున్న భామలు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో కేవలం కొన్ని సినిమాలకు మాత్రపై పరిమితం అవుతున్నారు. కొంతమంది బ్యూటీలు ఐటమ్ సాంగ్ లు చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు.