ఓ మహాకవి అన్నట్లు డబ్బుకు లోకం దాసోం అని డబ్బుంటే కొండమీది కోతినైనా తీసుకు రావొచ్చంటారు. అయితే ఈ కాలంలో కష్టపడి పనిచేసేవారికి వారు కనే కల సాకారం చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. అయితే కొంత మంది ఆ కల నెరవేర్చుకోవడానికి అడ్డదార్లు తొక్కుతు ఎదుటి వారిని నిలువునా దోచేయడం, మోసం చేయడం చేస్తూ అడ్డగోలు డబ్బు సంపాదిస్తున్నారు. దీనికోసం వారు ఎంచుకుంటున్న మార్గాలు డ్రగ్స్, వ్యభిచారం, కిడ్నాపులు, చైన్ స్నాచింగ్ ఇలా ఈజీ మనీ కోసం రక రకాలు వేషాలు వేస్తున్నారు.
ఇక సినిమా ఇండస్ట్రీలో ఒక్క చిన్న చాన్స్ వచ్చినా జన్మదన్యం అనుకునే ఈ రోజుల్లో రెండు సినిమాల్లో మంచి పాత్రలు వేసి కాస్త సెలబ్రెటీ అనిపించుకున్న ఓ యువ హీరో అదే తన పెట్టుబడిగా డ్రగ్స్ దందా చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యాడు. డేంజర్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాల్లో నటించిన అభిషేక్ డ్రగ్స్ రాకెట్ లో పోలీసులకు అడ్డంగా పట్టుబడి కటకటాలు లెక్కబెడుతున్నాడు. అయితే ఈ నేరాలకు తనకు కొత్తేమీ కాదు 2012 లో ఒకసారి పోలీసులకు దొరికిపోయి జైలుకి వెళ్లిన అభిషేక్ మరోసారి ఇలా బుక్కయ్యాడు.
సినిమాల్లో ఎలాగూ అవకాశాలు రావడం లేదని మరోసారి డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. కొంతమంది నైజీరియన్ లతో చేతులు కలిపిన అభిషేక్ డ్రగ్స్ దందా చేస్తూ యువతను మత్తుకు బానిస చేస్తూ..తాను మత్తులో మునిగి డబ్బు సంపాదిస్తున్నాడు. డబ్బు కి డబ్బు మత్తు కి మత్తు లభిస్తుండటంతో ఈ డ్రగ్ బిజినెస్ చేస్తున్నాడు అభిషేక్ . అయితే అరెస్ట్ కావడం బెయిల్ తీసుకోవడం బయట దర్జాగా తిరగడం కామన్ అయిపొయింది.