టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మూడో తరం నటులు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నారు. అటువంటి వారిలో అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ ప్రముఖంగా ఉన్నారు. అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ చిత్రం డిజాస్టర్ ని చూసింది. దీంతో ఈ యంగ్ హీరో చిన్నబోయాడు. అఖిల్ చిత్రం తన కెరీర్ కే ప్రమాధంగా మారంటంతో హీరో అఖిల్ వెంటనే మరోసారి రీ ఎంట్రీకి రెడీ అయ్యారు.
దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ని ఇప్పటికే అఖిల్ పూర్తి చేశారు. అయితే అఖిల్ రీ ఎంట్రీపై ప్రత్యేక దృష్టిని పెట్టారు నాగార్జున. నాగార్జున చాలా గ్యాప్ తీసుకుని తమ కుటుంబానికి మర్చిపోలేని క్లాసిక్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ కాంబినేషన్ ని అఖిల్ కోసం సెట్ చేశారు. మొదట్లో విక్రమ్ కుమార్ చెప్పిన కథ అఖిల్ కి సరిగా నచ్చకపోవటంతో మళ్ళీ మంచి కథతో రావాలని చెప్పారు.
దీంతో అఖిల్ కి విక్రమ్ కుమార్ సూపర్ కథని రెడీ చేయటం జరిగింది. ఇక తాజాగా విక్రమ్ కుమార్–అఖిల్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని అంటున్నారు. అఖిల్ కెరీర్లో రీలాంచ్ గా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతున్నాయి. అయితే నాగార్జున పదే పదే అఖిల్ సెకండ్ మూవీని రీ లాంచింగ్ అని అంటున్నారు. అఖిల్ డెబ్యూ చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేసిన నాగార్జున...రీ లాంచింగ్ సైతం అంతకు మించి గ్రాండ్ గా చేయనున్నారు.
అయితే మొదటి మూవీ ప్లాప్ కావటంతో నాగార్జున అఖిల్ సెకండ్ మూవీకి రీ లాంచింగ్ అని పేరు పెట్టారు. ఇక సెకండ్ మూవీ ప్లాప్ అయితే మూడో చిత్రానికి ఏ పేరు పెట్టాలి అనేది? ఇండస్ట్రీలో వినిపిస్తున్న ప్రశ్న. అందుకే నాగార్జున రీ లాంచింగ్ అనే పేరును వాడకుండా ఉంటే మంచిది అనే ఫీలింగ్ లో అఖిల్ ఉన్నారని అంటున్నారు. సెకండ్ మూవీని ఎటువంటి హంగామా లేకుండా డైరెక్ట్ గా రిలీజ్ చేస్తే...ఈ మూవీ కాస్త హిట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.