తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున హీరోగా కొనసాగుతున్న సమయంలోనే ఆయన తనయులు ఇద్దరు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలు కాగా ఆయన చిన్నకుమారుడు అఖిల్ ‘అఖిల్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వాస్తవానికి అఖిల్ బాలనటుడిగానే వెండి తెరకు పరిచయం అయినా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి చాలా టైం పట్టింది. మాస్ డైరెక్టర్ వివివినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖిల్’ చిత్రం అనుకున్న విజయం సాధించలేక పోయింది.
అయితే హీరోగా అఖిల్ డ్యాన్స్, ఫైట్స్, యాక్షన్ లో మంచి మార్కులే కొట్టేసినా ఇప్పటి వరకు మరో సినిమా చేయకపోవడం విశేషం. తాజాగా అక్కినేని అఖిల్, శ్రీయ భూపాల్‌ల పెళ్లి క్యాన్సిల్ అయిందన్న వార్త సంచలనం సృష్టించింది. ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్న అఖిల్ విషయంలో ఒక్కసారే ఇలాంటి సంఘటన జరగడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతగా ఇష్టపడ్డ శ్రీయ అఖిల్ మనసు గాయం చేసిందని అందుకే మనోడు బ్రేకప్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి అయితే అఖిల్, శ్రీయల మధ్య హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో గొడవ జరిగినట్టు తెలుస్తోంది. రోమ్‌లో పెళ్లి ఏర్పాట్లు చేసేందుకు నెల రోజుల క్రితం అఖిల్, శ్రీయ, ఆమె తల్లి బయల్దేరాట. ఈ గొడవ బహిరంగంగానే జరిగిందట..దీంతో శ్రీయను, ఆమె తల్లిని అక్కడే వదిలేసి, గుడ్‌బై చెప్పేసి అఖిల్ ఇంటికి వెళ్లిపోయాడట. వారిద్దరూ అఖిల్‌ను వారించే ప్రయత్నం కూడా చేయలేదట.
నిజానికి ఈ పెళ్లి నాగార్జునకు మొదట్నుంచీ ఇష్టం లేదట. చిన్న ఏజ్ (22 ఏళ్లు)లో, వయసులో పెద్దయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని అఖిల్‌కు నాగ్ ఎంతగానో నచ్చ చెప్పాడట. అప్పట్లో అఖిల్ ఇంట్లో వారి మాట వినలేదట..కానీ ఇప్పుడు అఖిల్‌ను, శ్రీయను కలిపేందుకు నాగ్ ఎంతగా ప్రయత్నించినా కుదరలేదట. దీంతో చేసిది లేక నాగ్ సైలెంట్ అయిపోయాడని సమాచారం.