పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీలో ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్ ప్రకారం దీనికి సంబంధించిన వివరాలను చూస్తే….త్వరలో ఓ మల్టీస్టారర్ కాంబినేషన్ తెరపైకి రానుంది. ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ కాంబినేషన్ లు వచ్చి కొన్ని హిట్స్ ని చూశాయి. మరికొన్ని ప్లాపులు చూశాయి.


అయితే సరైన కాంబినేసన్ వచ్చినప్పడు మాత్రం బాక్సాపీస్ ని షేక్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆ విధంగానే త్వరలో పవన్ కళ్యాణ్-గోపిచంద్ కాంబినేషన్ లో ఓ మూవీ రానుందని అంటున్నారు. ఈ మూవీలో వీరిద్దరూ కలిసి నటించేందుకు ఓ డైరెక్టర్ ఇప్పటికే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ని పూర్తిచేస్తున్నారని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మూవీలో గోపిచంద్ పాత్ర విలన్ గా ఉంటుందని అంటున్నారు.


గతంలో గోపిచంద్ విలన్ గా నటించిన చిత్రాలకి మంచి ఆధరణ వచ్చింది. ఇప్పుడు కూడ పవన్ కళ్యాణ్ మూవీలో గోపిచంద్ విలన్ గా నటించనుండటంతో ఈ మూవీపై మార్కెట్ లో అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందనే దానిపై స్పష్టత రాలేదు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయి.


ఒకవైపు గోపిచంద్ హీరోగా సినిమాలు చేస్తూనే పవన్ కళ్యాన్ మూవీలో విలన్ పాత్ర చేయాలని ప్రముఖ డైరెక్టర్ ప్రత్యేకంగా కోరగా…అందుకు గోపిచంద్ ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం గోపీచంద్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ సైతం రెండు చిత్రాల కమిట్మెంట్ తో బిజీగా ఉండటంతో ఆ తరువాత చేయబోయో చిత్రం వీరిద్దరి కాంబినేషన్ లో ఉండనుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: