తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు అరడజను మంది హీరోలు ఇంట్రడ్యూస్ అయ్యారు. అయితే ఇంద మంది హీరోలు ఉన్నా ఇండస్ట్రీలో ఎవరికి వారే పోటీ అన్న చందంగా ఎవరి టాలెంట్ వాళ్లు చూపిస్తున్నారు. ఇక మెగా హీరో అంటే డ్యాన్స్, ఫైట్స్, యాక్షన్ ఖచ్చితంగా ఉండాల్సిందే..అవి లేకుండా ఇండస్ట్రీలో నిలబడటం కష్టం. అల్లు రామలింగయ్య మనవడు..స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింత్ తనయుడు అల్లు అర్జున్ ‘గంగోత్రి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
ఆ సినిమాలో పెద్దగా హీరోయిజం చూపించకున్నా తర్వాత వచ్చిన దేశముదురు, బన్ని, ఆర్య చిత్రాలతో మనోడి స్టైల్, ఫైట్స్ చూసి అభిమానులకు పిచ్చెక్కిపోయింది. ఇలా ఇండస్ట్రీలో మనోడు స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక అల్లువారి కుటుంబం నుంచి మరో హీరో అల్లు శిరీష్ ‘గౌరవం’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు..కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడమే కాకుండా ఈ హీరోకి పర్ఫామెన్స్ బాగా రాదు అనే ముద్ర పడింది. తర్వాత మారుతి దర్శకత్వంలో ‘కొత్తజంట’ చిత్రంతో పరవాలేదు అనిపించుకున్నాడు.
రీసెంట్ గా వచ్చిన ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రంతో కాస్త మంచి పేరు తెచ్చుకున్నాడు అల్లు శిరీష్. ఈ మద్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రెటీలు తమ అభిప్రాయాలు ట్విట్టర్ ద్వారా తెలుపుతున్న విషయం తెలిసిందే..తాజాగా అల్లు శిరీష్ చేసిన పోరపాటుకు నవ్వాలో..ఏడ్వాలో అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం ప్రముఖ నిర్మాతగా ఉన్న అల్లు అరవింద్ చిరంజీవికి బామ్మర్ది. అంటే ఇప్పుడు హీరోలుగా వెలుగుతున్న అల్లు అర్జున్, అల్లు శిరీష్‌కు చిరంజీవి మావయ్య అవుతారు. వీళ్లిద్దరికీ చిరంజీవి ఏమవుతారో.. ఆయన సొంత తమ్ముడు పవన్ కల్యాణ్ కూడా అదే వరుస అవుతారు.
అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన యువ హీరోలిద్దరికీ పవన్ మావయ్యే అవుతాడు. ఈ విషయం తెలిసికూడా అల్లు శిరీష్ కాస్త ఎమోషన్,ఎగ్జైట్ మెంట్ లోనై ట్విట్టర్ లో మామయ్యకు బదులు బాబాయ్..అంటూ ట్విట్ చేశాడు. వాస్తవానికి పవన్ కళ్యాన్ ... రాంచరణ్ కి బాబాయ్ అవుతాడు. అల్లు శిరీష్ పాపం మరీ ఎగ్జైట్ మెంట్ లో మామని కాస్తా బాబాయ్ ని చేసేసాడు. పవన్ కళ్యాణ్ ని మామా అని పిలవాల్సింది పోయి బాబాయ్ అనేసాడు.
'కాటమరాయుడు' టీమ్‌కు విషెస్ చెబుతూ.. ''సూరీడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు. కల్యాణ్ బాబాయ్‌కు, శరత్ మరార్‌కు, దర్శకుడు డాలీకి నా శుభాకాంక్షలు.'' అని శిరీష్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ను ఒకటికి రెండు సార్లు చదివిన నెటిజన్లు ఇంత కన్ ఫ్యూజ్ మాస్టరా ఈ పిల్లోడు అంటూ నవ్వుకుంటున్నారు.
అల్లు శిరీష్ ట్విట్ :
Sooridalle occhadu mana andari #Katamarayudu! Wishing Kalyan babai, @sharrath_marar & whole unit ATB! @PawanKalyan https://t.co/xHclTamphD
— Allu Sirish (@AlluSirish) March 18, 2017