మల్లూ బ్యూటీ కీర్తి సురేష్ ఇప్పుడు ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్. తెలుగులో ఇప్పటివరకూ ఈమె నటించినది రెండే సినిమాలు. ఒకటి రామ్ తో నేను శైలజ అయితే.. రెండోది నానితో నేను లోకల్. ఈ రెండు సినిమాలు ఘనవిజయం సాధించాయి. వీటితో పాటు ప్రస్తుతం పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమా.. సావిత్రి బయోపిక్ మహానటి.. ఈమె చేతిలో ఉన్నాయి.


వీటితో పాటు టాప్ హీరోల చిత్రాలు క్యూ కడుతుండటంతో కీర్తిసురేష్‌ తన గేమ్‌ ని స్టార్ట్ చేశారు. తన రెమ్యునరేషన్ ని అమాంతంగా పెంచేసింది. దర్శకులు, హీరోలని గ్రిప్ లో పెట్టుకొని నిర్మాతల వద్ద నుండి భారీ రెమ్యునరేషన్ ని ఈ బ్యూటీ వసూలు చేస్తుంది. దీని కారణంగా పవన్ సినిమాకి, మహానటి మూవీకి కీర్తిసురేష్‌ తీసుకునే రెమ్యునరేషన్ 3 కోట్ల రూపాయలు.


తెలుగు-తమిళ్ రెండు భాషల్లో రిలీజ్ కానున్న సినిమా కావడంతో తన రెమ్యునరేషన్ ని భారీగా పెంచినట్టుగా తెలుస్తుంది. తమిళ్ లో కీర్తిసురేష్‌ కి మంచి హిట్స్ ఉండడంతో ఈ బ్యూటీకి 2కోట్ల రూపాయల వరకూ కోలీవుడ్‌ లోనూ రెమ్యునరేషణ్ అందుకుంటుంది. తనతో మూవీ తీస్తే...తెలుగు, తమిళ మార్కెట్ లో శాటిలైట్ రైట్స్ కి మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే నిర్మాతలు కూడ కీర్తిసురేష్‌ కి రెమ్యునరేషన్ ఎక్కువయినా హీరోయిన్ గా తీసుకుంటున్నారు.


అయితే తాజాగా కీర్తిసురేష్‌ ఓ నిర్మాతకి తన రెమ్యునరేషన్ మూడున్నర కోట్ల రూపాయలకి చెప్పుకుంది. దీంతో నిర్మాత హడలిపోయి తనని హీరోయిన్ గా తీసుకునే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. దీంతో హీరో వద్ద నుండి మేటర్ ని డీల్ చేసిన కీర్తిసురేష్‌...ఫైనల్ గా నో చెప్పిన నిర్మాత నోటి నుండి యస్ అని చెప్పించుకుందట. మొత్తంగా నిర్మాతలని కీర్తి సురేష్‌ తెగ భయపెడుతుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: