టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని సంచలనాలకి కేరాఫ్ గా మారుతుంటారు ఆర్టిస్ట్ సురేఖ వాణి. సురేఖ వాణి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స‌హాయ‌న‌టిగానే కాకుండా సీరియ‌ల్స్ లో న‌టిగా, యాంక‌ర్‌గా తన ప్రతిభని చూపుతుంటారు. మొత్తంగా సురేఖ వాణి ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో సురేఖ వాణి కి సంబంధించిన కొన్ని ప్రవేట్ వీడియోలు బయటకు రావటంతో ఇవి సంచలనంగా మారుతున్నాయి.

అయితే అలా బయటకు వచ్చిన వీడియోలలో ఏ మాత్రం అభ్యంతరకరమైన ఫుటేజ్ లేదు కానీ…తనని ఇప్పటివరకూ ఎవ్వరూ చూడని కోణంలో కనిపించటమే ఇది షాకింగ్ లా మారాయి. గతంలో సురేఖ వాణి కాస్త హాట్ గా కనిపిస్తూ కూతురుతో డ్యాన్స్ చేయటం వంటివి ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా మారాయి. ఇప్పుడు తాజాగా సురేఖ వాణి తన బెడ్‌రూమ్ సెల్ఫీతో హాట్ టాపిక్ గా మారారు.

ఇంటి బెడ్ రూంలని సైతం సెల్పీల కోసం వాడవచ్చా? అనే కోణంలో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాక్స్ నడుస్తున్నాయి. అయితే ఈ ఫోటో నిజమైనదా? కాదా? అనే అనుమానాలు సైతం బయట వినిపిస్తున్నాయి. సురేఖ వాణి మొగుడ్స్ పెళ్లామ్స్ అనే టీవీ రియాలిటీ షోతో పాపుల‌ర్ గా మారి పలు టీవీ సీరియ‌ళ్లు, సినిమాల‌తో బిజీగా మారింది. 

సాధారణంగా సురేఖ వాణి వివాదాలను దూరంగానే ఉంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రం తన వీడియోలతో, ఫోటోలతో కాస్త హల్ చల్ గా మారతారు. మొత్తంగా సురేఖ వాణి పెట్టిన బెడ్ రూం సెల్పీ పై తను చెబుతున్న మాటలు చూస్తే…ఇది లొకేషన్ ఫొటో తప్పితే నిజమైనది కాదు అని అంటున్నారు. ఎవరో కావాలనే ఈ విధంగా దుమారం రేపుతున్నారని అంటున్నారు. ఇలా చేయటం వల్ల వాళ్ళకి ఏమొస్తుందో మాత్రం తనకి అర్ధం కావటం లేదని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: