సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా రాశి ఖన్నా ఉన్నారు. ఒకవైపు తను కమర్షియల్ ఫార్మెట్ సినిమాలు చేస్తూనే మరోవైపు తనేంటో నిరూపించుకునే పాత్రలను చేస్తున్నారు. ఈ విధంగా టాప్ హీరోయిన్స్ లో ప్రయోగాలు చేస్తున్న వారిలో రాశి ఖన్నా ఒక్కరే కనిపిస్తున్నారు. ఇప్పుడిప్పుడే మంచి హిట్స్ ని అందుకుంటున్న రాశి ఖన్నా కెరీర్ టాప్ గేర్ లో దూసుకుపోతుంది.
అంతే కాకుండా తన అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కించే గ్లామర్ ఉండటం తనకి మరో ప్లస్ అయింది. ఇక తాజాగా రాశి ఖన్నా తన మనస్సులోని మాటని బయటకు చెప్పింది. లేడి విలన్ పాత్రలు వస్తే తప్పకుండా చేస్తానని..నెగిటివ్ షేడ్స్ పాత్రలంటే తనకి ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చింది. అందుకే తన ఆలోచనలకి తగ్గట్టుగా మళయాలంలో ఇప్పటికే ఓ నెగిటివ్ రోల్ ఉన్న సినిమాలో నటిస్తునారు.
మళయాళీ స్టార్ హీరో మోహన్ లాల్ న్యూ మూవీ ‘విలన్’ లో రాశి ఖన్నా ఓ నెగిటివ్ పోలీసాఫీసర్ రోల్ కనిపించనుంది. అయితే ఈ బ్యూటీ నెగిటివ్ పాత్రలో చాలా బాగా నటించటంతో ఓ డైరెక్టర్ రాశి ఖన్నా తో ఏకంగా ఫుల్ లెన్త్ సినిమానే ప్లాన్ చేశారు. హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంగా ఇది రాబోతుంది. దాదాపు 30 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయని అంటున్నారు.
ప్రస్తుతం రాశిఖన్నా ఎన్టీఆర్, గోపీచంద్, రవితేజ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు మరో రెండు తమిళ సినిమాలను కూడా ఒకే చేసింది. ఒకరకంగా చెప్పాలంటే ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్స్ కంటే రాశి ఖన్నా చేతిలోనే ఎక్కువ సినిమాలు ఉన్నాయిన అంటున్నారు.